Begin typing your search above and press return to search.
ఈ సంఘాలను నమ్ముకుంటే అంతే సంగతులా?
By: Tupaki Desk | 30 Aug 2022 4:51 AM GMTపెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ఒకమాటన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన రైతుసంఘాలు తనతో సమావేశమయ్యాయట. ఆ సమయంలో రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లోకి తాను తప్పకుండా ప్రవేశించాల్సిందే అని చెప్పారట. మీటర్లు లేని కరెంటు సరఫరా కోసం దేశమంతా తనకోసం ఎదురుచూస్తున్నట్లు ప్రతినిధులు తనతో చెప్పారని కేసీయార్ గొప్పగా చెప్పుకున్నారు.
అంతమంది ప్రతినిధులు తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని అడుగుతున్నారని మరి జాతీయ రాజకీయాల్లోకి వెళదామా అంటు కేసీయార్ అడగ్గానే జనాలంతా వెళదాం, వెళదాం అంటు నినాదాలిచ్చారు.
దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు మరోసారి అర్ధమవుతోంది. నిజానికి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీయార్ చాలా రోజుల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాకపోతే కాలం కలిసి రాకపోవటంతో వెనకడుగు వేస్తున్నారంతే.
ఇపుడేదో కొత్తగా రైతు సంఘాల ప్రతినిధులు కేసీయార్ ను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఒత్తిడి పెడుతున్నట్లు, అందుకు కేసీయార్ అంగీకరిస్తున్నట్లు ఎలివేషన్ ఇస్తున్నారంతే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ తో భేటీ అయిన ప్రతినిధులంతా తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ తమ రాజకీయాల్లో పడిపోతారు. వాళ్ళెవరూ కేసీయార్ కు మద్దతుగా నిలిచేవారు కాదు. పైగా రైతు సంఘాల ప్రతినిధులు మద్దతుగా నిలిచి నంత మాత్రాన కేసీయార్ కు పెద్దగా లాభం కూడా ఉండదు.
ఎందుకంటే నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతు సంఘాల ఎంత పెద్ద ఉద్యమం నడిపాయో అందరు చూసిందే. తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉద్యమ నేత రాకేష్ తికాయత్ ఉన్న యూపీ ప్రాంతంలో కూడా బీజేపీ స్వీప్ చేసేసింది.
పోలింగుకు ముందున్న వాతావరణమైతే తికాయత్ ఉన్న ప్రాంతంలోని సుమారు 128 స్ధానాల్లో బీజేపీకి పెద్ద దెబ్బ పడుతుందనే అనుకున్నారంతా. కానీ పోలింగ్ జరిగిన తర్వాత ఫలితాల్లో చూస్తే బీజేపీనే మ్యాగ్జిమమ్ సీట్లు గెలుచుకున్నది. కాబట్టి రైతు ప్రతినిధులను కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉండే రాజకీయ పార్టీల మద్దతుంటేనే జాతీయ రాజకీయాల్లో రాణిస్తారు లేకపోతే జీరోనే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.