Begin typing your search above and press return to search.
నాయిని అల్లుడికి టికెట్.. కేసీఆర్ ఓకే?
By: Tupaki Desk | 15 Sep 2018 7:42 AM GMTతెలంగాణ కోసం కోట్లాట తర్వాత.. ఏళ్లకు ఏళ్లుగా టీఆర్ ఎస్ ను నమ్ముకున్న నాయినికి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాటిచ్చేశారట. ఆ విషయాన్ని నాయినినే స్వయంగా వెల్లడించారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన అల్లుడికి టీఆర్ ఎస్ టికెట్ ఇవ్వాలంటూ నాయిని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎప్పటి నుంచో తన అల్లుడు కార్పొరేటర్ శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వాలన్న కోరటం.. ఈ విషయంపై నిర్ణయం తీసుకోని కేసీఆర్.. మొన్న ప్రకటించిన 105 స్థానాల్లో ముషీరాబాద్ టికెట్ ను ఎవరికీ కేటాయించలేదు. నాయిని లాంటి విశ్వాసపాత్రుడు.. నాలుగున్నరేళ్ల టీఆర్ ఎస్ పాలనతో హోంమంత్రిగా వ్యవహరించిన ఆయన ఏ రోజూ కేసీఆర్ మాటను కాదనలేదు. ఆయనకు ఇబ్బంది కలిగేలా సొంత నిర్ణయాన్ని తీసుకున్నది లేదు.
మరి.. అలాంటి విధేయ నాయిని కోరికను మన్నించి.. ఆయన అల్లుడికి టికెట్ ను కేసీఆర్ ఎందుకు కన్ఫర్మ్ చేయలేదంటే.. దానికో కారణముంది. బయట జోరుగా సాగుతున్న ప్రచారానికి తగ్గట్లు టీఆర్ ఎస్.. బీజేపీకి మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ప్రకారం బీజేపీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో బలమైన అభ్యర్థులు లేకుండా చూడాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంటుంది. ఇందులో భాగంగానే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ స్థానంలోనూ అభ్యర్థిని నిలబెట్టలేదు.
నాయిని కోరుకున్నట్లు ఆయన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి సీటు ఇచ్చిన పక్షంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని లెక్కల ప్రకారం లక్ష్మణ్ ఓడిపోయే ప్రమాదం పొంచి ఉంది. మరి.. అలాంటప్పుడు చూస్తూ చూస్తూ మోడీ మాష్టారికి ఇచ్చిన మాట కోసం కేసీఆర్ మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంతోనే సీటుకు అభ్యర్థిని ప్రకటించకుండా ఫాంహౌస్ లోకి వెళ్లి యమా థింక్ చేసేస్తున్నారు. దీంతో.. సీటు అంతిమంగా ఎవరికి దక్కుతుందన్నది పెద్ద ఉత్కంటగా మారింది.
ఈ సస్పెన్స్ ఇలా సాగుతున్న వేళ తాజాగా నాయిని నోరు విప్పారు. ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ ను తమకే కేటాయించనున్న విషయాన్ని తమకు చెప్పినట్లుగా తాజాగా మాజీ హోంమంత్రి నాయిని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి సీటు ఖరారు చేసిన వైనంపై కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా ఆయన చెప్పారు. అసలు తమకు ఇంత ఆలస్యం జరగాల్సిన అవసరం లేదని.. తొలి లిస్ట్‌లోని 105 స్థానాల్లోనే తమ టికెట్ వివరాల్ని ప్రకటించాల్సి ఉన్నా.. అలా జరగలేదన్న ఆయన టికెట్ తమదేనని నాయిని చెబుతున్నారు. అంతా బాగుంది కానీ.. అల్లుడి సీటు కోసం నాయినికి హామీ ఇస్తే సరిపోదు కదా? మరి.. మోడీషాలకు ఇచ్చిన మాటేమంటారు కేసీఆర్ జీ?