Begin typing your search above and press return to search.

తెలంగాణ సాధించిన కేసీఆర్‌.. ఆ రాష్ట్రాల‌కు ఏం చెబుతారు?

By:  Tupaki Desk   |   16 Jun 2022 11:30 PM GMT
తెలంగాణ సాధించిన కేసీఆర్‌.. ఆ రాష్ట్రాల‌కు ఏం చెబుతారు?
X
జాతీయ పార్టీ అంటూ.. ప్ర‌క‌ట‌న చేసేందుకు రెడీ అవుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కొన్ని చిక్కులు త‌ప్పేలా కనిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎందుకంటే.. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆయ‌న‌నుచూసి.. స్ఫూర్తి పొందిన వారు.. అప్ప‌టికే ప్ర‌త్యేక రాష్ట్రాలు కావాల‌ని కోరుకుంటున్న వారు.. కేసీఆర్ నాయ‌క‌త్వానికి జైకొట్టే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఎందుకంటే.. కొన్ని ద‌శాబ్దాలుగా దేశంలో ప్ర‌త్యేక రాష్ట్రాల కోసం.. ఉద్య‌మాలు జ‌రుగుతున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు అతి పెద్ద రాష్ట్రం యూపీని తీసుకుంటే.. ఇక్క‌డ ప్ర‌త్యేక ఉత్త‌రాంచ‌ల్ రాష్ట్రం కోసం... ఇప్ప‌టికీ పోరాటాలు సాగుతున్నాయి. అయితే.. యూపీలో యోగి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. ఉద్య‌మ కారుల‌పై ఉక్కుపాదంమోప‌డం.. కొంద‌రు నాయ‌కుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం తో ఈ ఉద్య‌మాలు.. నివురు గ‌ప్పిన నిప్పులా మారాయి. అయితే.. ఆయా ప్రాంతాల్లో ప్ర‌జ‌లు మాత్రం .. ప్ర‌త్యేక రాష్ట్రాల కోసం.. ఇప్ప‌టికీ.. ఉద్య‌మిస్తూనే ఉన్నారు.

అదేవిధంగా ప‌శ్చిమ బెంగాల్‌ను తీసుకుంటే.. ఇక్క‌డ గూర్ఖాల్యాండ్ ఉద్య‌మం ఇప్ప‌టికీ స‌జీవంగానే ఉం ది. ఇటీవ‌ల కూడా ఈ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్యమ కారులు.. అక్క‌డ ఆందోళ‌న‌కు దిగ‌డం.. త‌న ప్రాణ‌మైనా ఇస్తాను కానీ.. రాష్ట్రాన్ని మాత్రం విడిపోనీయ‌ని.. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ చెప్ప‌డం..తెలిసిందే. అంతేకాదు.. యూపీలో బీజేపీ పాలిత ప్ర‌భుత్వం.. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని అణిచేస్తూ.. బెంగాల్‌లో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ కారుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని కూడా ఆమె ఆరోపిస్తున్నారు.

మ‌రోవైపు.. ఏపీలోని రాయ‌ల‌సీమ‌ విష‌యంలోనూ.. ఉత్త‌రాంధ్ర జిల్లాల విష‌య‌లోనూ.. ప్ర‌త్యేక రాష్ట్రాల వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో కేసీఆర్ క‌నుక జాతీయ వాదాన్ని ఎంచుకుంటే.. ఈ ప్ర‌త్యేక రాష్ట్రాలు కోరుకునే వారు.. కేసీఆర్‌పై ఒత్తిడి పెంచే అవ‌కాశం ఉంటుంద‌నేది విశ్లేష‌కుల మాట‌.

ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి ప్ర‌త్యేక తెలంగాణ సాధించిన విధంగానే త‌మ‌కు కూడా ప్ర‌త్యేక రాష్ట్రాలుఏర్పాటు చేయాల‌నే దిశ‌గా ఆయ‌న‌పై ఒత్తిడి పెంచితే.. ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రి కేసీఆర్ దీనికి ఎలాంటి స‌మాధానం చెబుతారో..వారిని ఎలా త‌న‌వైపు తిప్పుకొంటారో చూడాలి.