Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు సిగ్గు అనిపించిన విషయం అదేనట
By: Tupaki Desk | 20 Jun 2017 11:37 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ తెలంగాణలో 35 లక్షల గొల్లకురుమలున్న రాష్ట్రంలో 650 లారీల గొర్రెలను దిగుమతి చేసుకోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. 650 లారీలను దిగుమతి చేసుకోవడం కాదు.. ప్రతీ రోజు ఆరు వేల లారీల గొర్రెలను ఎగుమతి చేసే స్థాయికి పోవాలన్నారు. కోటిన్నర లక్షల గొర్రెలను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. నేడు పంపిణీ చేసిన గొర్రెలు.. రెండున్నర ఏళ్లలో మూడు ఈతల్లో ఏడున్నర కోట్ల గొర్రెలు అవుతాయని చెప్పారు. రూ. 25 వేల కోట్ల సంపదను తెలంగాణ గొల్లకురుమలు సృష్టించబోతున్నారని పేర్కొన్నారు. సంపద అంటే ఇదే.. అర్థం కాని గొర్రెలకు ఏం చెప్తామని విమర్శించారు. గ్రామాలు బలంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. గొల్లకురుమలకు గొర్రెలను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని కేసీఆర్ అన్నారు.
ప్రపంచ రైతాంగానికి తెలంగాణ రైతాంగం ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. గ్రామీణ తెలంగాణ ధనవంతమైతేనే తెలంగాణ ధనవంతమైతదని పేర్కొన్నారు. పంటల సాగుకు అవసరమైన విద్యుత్, సాగునీరు, పెట్టుబడి రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. పంట పెట్టుబడి కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. హైదరాబాద్ నుంచే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. ప్రస్తుతం రైతుల వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మే 15 వరకు తొలి విడత పంటల పెట్టుబడి రైతుల ఖాతాల్లో వేస్తామని సీఎం ప్రకటించారు. గ్రామ రైతు సంఘాలు నిజాయితీగా వ్యవహరించి.. పథకాల్లో అవకతవకలు లేకుండా చూడాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా.. వారి బాధలను తమతో పంచుకోవాలన్నారు.
తెలంగాణలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసి తీరుతామని ఉద్ఘాటించారు. ఎవరెన్ని అడ్డంకులు చేసినా బంగారు తెలంగాణ అయి తీరుతుందన్నారు. చిల్లర రాజకీయాల కోసం ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులను అడ్డుకునే వాళ్లను రైతులు నిలదీయాలని సూచించారు. అవిశ్రాంత పోరాటంతో రాష్ట్రం సాధించినట్లే.. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ చేసి తీరుతామని స్పష్టం చేశారు. పారిశ్రామిక, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.ఆర్థిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని స్పష్టం చేశారు. గ్రామసీమల్లోనే నైపుణ్యం కలిగిన మానవ వనరులున్నాయన్నారు. మానవ సంపదను కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లు ఉంటుందని ఉద్ఘాటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే లక్ష్యమని తేల్చిచెప్పారు.
తెలంగాణ గొల్లకురుమలు నా దృష్టిలో గొప్ప సంపద అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత దేశంలో అత్యంత ధనవంతమైన గొల్లకురుమలు తెలంగాణలో ఉన్నారని చెప్పుకుంటామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల సంపదను గొల్లకురుమలు సృష్టించబోతున్నారని చెప్పారు. 1948-56 మధ్య కాలంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని నాడు వేల ఉద్యమ సభల్లో చెప్పానని గుర్తు చేశారు. నాడు తాను చెప్పింది.. నేడు నిజమైందన్నారు. గొర్రెల పంపిణీకి కొండపాక నుంచి బలమైన పునాది పడిందన్నారు. దాదాపు కోటిన్నర గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. 7 లక్షల 61 వేల దరఖాస్తులు వస్తే 7 లక్షల 18 వేల మందికి గొర్రెలు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. ప్రతి రోజు రాష్ర్టానికి 650 లారీల గొర్రెలు హైదరాబాద్‌కు వస్తున్నాయని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/