Begin typing your search above and press return to search.
ఆకర్ష్ వ్యూహం మార్చిన కేసీఆర్
By: Tupaki Desk | 23 April 2016 9:56 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ రెండో దశలో భాగంగా కొత్త కాన్సెప్ట్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. ఇన్నాళ్లు ప్రతిపక్ష టీడీపీ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లక్ష్యంగా సాగిన ఈ ఎత్తుగడ ఇపుడు రూటుమారి సీనియర్ నేతలపై పడింది. ఇప్పటికే ఇందులో ప్రాథమిక దశను పూర్తిచేసిన కేసీఆర్ త్వరలో ఆ జోరు పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఆకర్ష్ ఎత్తుగడతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కోలుకోలేని విధంగా కేసీఆర్ దెబ్బతీశారు. టీడీపీ లాగానే కాంగ్రెస్ పార్టీపై ప్రత్యేక నజర్ పెట్టిన కేసీఆర్ ఆ మేరకు కొంత విజయం సాధించారు. అయితే పూర్తి స్థాయిలో తగిన ఫలితం రాకపోవడంతో కొత్త రూట్ లోకి దాన్ని మల్చారు. మాజీ మంత్రులు - మాజీ ఎమ్మెల్యేలు - జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్ తో పాటు మాజీ ఎమ్మెల్సీలను టీఆర్ ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున వ్యూహాన్ని రూపొందించి అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే - తెలుగుదేశంకు చెందిన మాజీ మంత్రి పి.రాములు టీఆర్ ఎస్ లో చేరడం ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.
ఆయా జిల్లాల వారీగా కాంగ్రెస్ - టీడీపీలకు చెందిన సీనియర్లు - పదవుల్లో లేని నాయకుల జాబితాను ముందరపెట్టుకున్న కేసీఆర్ వారిని దఫదపాలుగా కారెక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్న పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని ఇందుకు ఒప్పించి అనంతరం సదరు రాబోయే నేతకు కండువా కప్పేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు.