Begin typing your search above and press return to search.
మామాఅల్లుళ్లు ఇద్దరు ముంబయి వెళ్లారు
By: Tupaki Desk | 7 March 2016 9:40 AM GMTకొన్ని కాంబినేషన్ లు విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. మేనల్లుడ్ని వాయిదాల పద్దతిలో అభినందించే మేనమామ కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి కాస్త భిన్నంగా ఉంటుంది. ఎప్పుడేం చేయాలో ఆయనకు బాగా తెలుసు. కొడుక్కి పెద్దపీట వేసే విషయంలో చేయాల్సిందంతా చేస్తూనే.. మొదటి నుంచి తన వెంటే ఉండే మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ రావు మనసు నొచ్చుకోకుండా చేస్తున్న ఆయన.. తాజాగా మహారాష్ట్రకు వెళ్లిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం చేసుకోనున్న చారిత్రక ఇరిగేషన్ ఒప్పందాల నేపథ్యంలో తనతో పాటు.. మేనల్లుడు హరీశ్ ను కేసీఆర్ వెంట బెట్టుకెళ్లారు. మేనమామ.. అల్లుళ్లు అయినప్పటికీ ఇద్దరూ కలిసి ప్రయాణాలు చేసేది కాస్త తక్కువే. అయితే..ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఇద్దరూ కలిసి ఒకే విమానంలో కలిసి వెళ్లటం పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
మేనమామకు పెట్టని కోటలా వ్యవహరించే హరీశ్.. మేనల్లుడిని జాగ్రత్తగా చూసుకునే కేసీఆర్.. ఇద్దరి కలిసి చేస్తున్న మహారాష్ట్ర జర్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తి కావటంతో పాటు.. తెలంగాణకు మరింత మేలు జరగాలని ఆశిద్దాం.