Begin typing your search above and press return to search.

కాంట్రాక్టు క్రెడిట్ కేసీఆర్ కా బాబుకా?

By:  Tupaki Desk   |   3 Jan 2016 5:30 PM GMT
కాంట్రాక్టు క్రెడిట్ కేసీఆర్ కా బాబుకా?
X
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయితే, తెలంగాణలో ఇప్పుడు కొత్త చర్చ నడుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన చర్చ కేసీఆర్ కు దక్కుతుందా చంద్రబాబుకు దక్కతుందా అని.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఆయన తన హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా దాని బదులుగా తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను తక్కువ జీతానికి భర్తీ చేయడానికి కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొచ్చారు. అది కాస్త రాజకీయమయమైంది. రాజకీయ నాయకులు తమకు నచ్చిన వారిని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్నవారిని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. దాంతో ప్రతిభావంతులు కష్టపడే తత్వం ఉన్నవాళ్లు తీవ్రంగా నష్టపోయారు. కేవలం రాజకీయ ప్రాబల్యం ఉన్నవాళ్లు మాత్రం ఉద్యోగాలు సంపాదించారు.

ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత కాంట్రాక్టు వ్యవస్థను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమబద్ధీకరించారు. దాంతో రాజకీయ నాయకుల ప్రాబల్యంతో ఉద్యోగం సంపాదించిన వాళ్లంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అయిపోతున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులకు మాత్రం తీవ్ర నష్టం జరుగుతోంది.

అయితే అసలు కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టిందే చంద్రబాబు కనక ఇప్పుడు తెలంగాణలోని 18 వేల మంది ఉద్యోగులూ చంద్రబాబుకే జై కొట్టాలని కొంతమంది అంటుంటే అసలు క్రమబద్ధీకరించింది కేసీఆర్ కనక ఆయనకు జైకొట్టాలని మరికొందరు అంటున్నారు. కాంట్రాక్టు వ్యవస్థను పెట్టిన చంద్రబాబుకు క్రెడిట్ దక్కుతుందని కొందరు అంటుంటే లేదు.. కేసీఆర్ కు అని మరికొందరు అంటున్నారు.