Begin typing your search above and press return to search.
ఒక సీఎం అధ్యయనం... మరో సీఎం మౌనం
By: Tupaki Desk | 28 Sep 2015 10:30 PM GMTరైతుల ఆత్మహత్యలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలూ అందుకు మినహాయింపేమీ కాదు. చనిపోతున్న అన్నదాతల కుటుంబాలకు పరిహారం ఇచ్చినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం దొరకదు.. అలా అని మొత్తానికి పట్టించుకోకపోవడం మానవత్వం అనిపించుకోదు... ప్రజామోదంతో పదవులు అందుకున్న నాయకులకు అది న్యాయమూ కాదు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వడంతోనే సరిపెట్టారు.. కానీ, తాజాగా సీఎం చంద్రబాబునాయుడు ఆత్మహత్యలకు మూలాలు కనుగొనాలని... వాటిని నిరోధించాలంటే మూలాల నుంచి సమస్యను పరిష్కరించుకుంటూ రావాలని తలపోశారు. దీంతో ఒకరకంగా ఈ విషయంలో మంచి స్పందన కనబరిచినట్లేనని చెప్పుకోవాలి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆత్మహత్యల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోంది. చెట్టుచెట్టుకూ రైతులు వేలాడుతుంటే ఏమీ చూడనట్లే రాష్ట్రంలో సాగిపోతున్నారు కేసీఆర్. ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్న కొద్దీ... రైతులను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్న కొద్దీ మరింత మొండికేస్తూ ఆ ఒక్క విషయాన్నీ పక్కనపెడుతున్నారు. తాను సీఎం అయిన తరువాత తెలంగాణలో అనేక వర్గాలకు న్యాయం చేసి... ఏళ్ల తరబడి ఉన్న సమస్యలనూ పరిష్కరించి భళా అనిపించుకున్నా రైతుల విషయంలో మాత్రం ఆయన చాలా మొండిగా ఉన్నారు. ఇంతవరకు కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు కూడా. ఈ తరుణంలో ఏపీలో చంద్రబాబు దీనిపై ఏకంగా అధ్యయనం చేయిస్తుండడం కేసీఆర్ కు కాస్త ఇబ్బందికర అంశమే.
ఏపీలో ఆత్మహత్యలు పెరగడంపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యార్థులు, రైతుల బలవన్మరణాల పెరుగుతుండడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులు, వాటిని అరికట్టే మార్గాల అన్వేషణపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.
2014లో దేశవ్యాప్తంగా 5650 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, మహారాష్ట్రలో అత్యధికంగా 2558మంది ఉన్నారు, తెలంగాణలో 898 - మధ్యప్రదేశ్ లో 896 - ఛత్తీస్ ఘడ్ లో 443 - కర్ణాటకలో 321 - ఎపిలో 48 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదిక చెప్తోంది. గత పదిహేనేళ్ళలో అనంతపురం - చిత్తూరు - గుంటూరు - కడప - ప్రకాశం జిల్లాల్లో ఆత్మహత్యలు పెరిగాయి. అనంతపురం జిల్లాలో 11 మండలాల్లో ఆత్మహత్యలు మరీ ఎక్కువ.
ఇవీ కారణాలు..
- అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవడం
- పనిచేయని బోరుబావులు
- బోరుబావులు వేయడానికి విపరీతంగా ఖర్చు చేయడం
- ఎక్కువకౌలుకు భూములు తీసుకోవడం
- గ్యారంటీ లేని వానిజ్య పంటలు వేయడం
తాజాగా చంద్రబాబు ఆదేశించడంతో ఈ కారణాలతోపాటు ఇంకా ఇతర కారణాలుంటున్నాయా..? ఈ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి...? రైతులను ఎలా బతికించుకోవాలన్న అంశాలపై అధ్యయనం చేస్తారు.
అంతేకాదు.. రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిన ప్రాంతాలను గుర్తించి.. అక్కడ బోర్లు వేసినా చుక్క నీరు రాదన్న నిజం రైతులకు చెప్పి ఆయా ప్రాంతాల్లో బోర్ వెల్స్ వేయకుండా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచన. రైతులకు ప్రయోజనం కలిగించే బీమా పథకాల గురించి అధ్యయనం చేసి రైతులకు వాటిని చేరువ చేయాలనీ అనుకుంటున్నారు.
ఏపీలో పరిస్థితులు... ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు ఇలా ఉండగా తెలంగాణ మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే వెయ్యి మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆ ఒక్క సమస్య తప్ప అన్నిటినీ పట్టించుకుంటున్నారు. ఆదిలోనే దీనిపై విపక్షాలు ప్రభుత్వంపై దాడి పెంచడంతో ఇప్పుడు ఏం చేసినా అది విపక్షాల పట్టుదల వల్లే తాను స్పందించినట్లు అవుతుందని ఆయన అనుకుంటున్నారు. కాబట్టి ఏకంగా రైతుల ఆత్మహత్యలపై ఉలుకూపలుకూ లేకుండా ఉంటున్నారు. తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికుల జీతాలు భారీగా పెంచారు.. అడిగిన ప్రతి కులసంఘానికీ కోట్ల విలువైన భూములు, భవనాలు ఇచ్చారు. ఉద్యమంలో నష్టపోయిన కుటుంబాలకు న్యాయం చేశారు.. తెలంగాణలో ఏ ఒక్క వర్గానికీ అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంలో ఉన్న ఆయన అన్నదాతలన మాత్రం విస్మరిస్తున్నారు. విపక్షాలకు రాజకీయ లబ్ధి కలుగుతుందేమోనన్న ఆయన భయం వేలాది రైతు కుటుంబాలకు శాపంగా మారుతోంది. ఓ వైపు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మూలాల నుంచి సమస్యను శోధించి తుదముట్టించాలని ప్రయత్నిస్తుంటే కేసీఆర్ మాత్రం కనీసం సానుభూతి, పరామర్శలతోనైనా ఆ బాధ తగ్గించాలని ప్రయత్నించడం మొండితనమే. రాజకీయాల్లో మూర్ఖత్వం ఒక్కోసారి పనికిరావొచ్చు కానీ రాజుకు మూర్ఖత్వం పనికిరాదన్న సత్యం కేసీఆర్ తెలుసుకోవాల్సి ఉంది.