Begin typing your search above and press return to search.
వారసుడిపై ఇద్దరు చంద్రుళ్ల ఆలోచనలు ఒకటేనా?
By: Tupaki Desk | 18 Oct 2016 10:30 PM GMTపేరులోనే కాదు.. చాలా విషయాల్లో ఇద్దరి చంద్రుళ్ల ఆలోచనా తీరు ఒకేలా ఉంటుందన్న విషయం తెలిసిందే. దీనికి నిదర్శనంగా గడిచిన రెండున్నరేళ్లలో చాలానే నిర్ణయాలు కనిపించాయి. తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంటుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. టీఆర్ ఎస్ లో కీలక భూమిక పోషిస్తూ.. పార్టీకి తన తర్వాత వారసుడిని నిర్ణయించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించటమే కాదు.. కొడుకు కేటీఆరే నెంబర్ టూ అన్న విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అధికారికంగా ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండానే.. తన తర్వాత తన కొడుకే కీలకమన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయటమే కాదు.. తన కొడుకు సమర్థతను నిరూపించే వేదికల్ని ఆయన కల్పించారని చెబుతారు.
తండ్రి ఇచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవటమే కాదు.. అందరి మనసుల్ని దోచుకునేలా వ్యవహరించే కేటీఆర్.. తనకు పోటీగా ఉండే బావ హరీశ్ కంటే తానే మెరుగైన వారసుడినన్న విషయాన్ని రుజువు చేసుకున్నారని చెప్పాలి. కేటీఆర్ పరిస్థితి ఇలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ విషయం కాస్త భిన్నమని చెప్పాలి. ఆయన్ను మొదటి నుంచి పార్టీ వ్యవహారాలకే పరిమితం చేయటం.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయకుండా ఉంచటం తెలిసిందే.
పార్టీకి సంబంధించినంత వరకూ చంద్రబాబు అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహించటంతోపాటు.. అందరిని కలుపుకుపోయే విషయంలోనూ లోకేశ్ మంచి మార్కుల్నే సంపాదించారని చెప్పాలి. అయితే.. ఆయన్ను వీలైనంత త్వరగా పార్టీ బాధ్యతలతో పాటు ప్రభుత్వ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. అయినప్పటికీ.. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్టేటస్ కో మొయింటైన్ చేస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా లోకేశ్ ను మంత్రిని చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. త్వరలో మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి లోకేశ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించే దిశగా బాబు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన తర్వాత తన వారసుడిగా లోకేశ్ ను ఎప్పుడో కన్ఫర్మ్ చేసేసిన చంద్రబాబు.. ఆయన సమర్థత అందరికి అర్థమయ్యే అవకాశాన్నిఇవ్వలేదన్న ఫిర్యాదు బాబుపై ఉంది.
దీన్ని తొలగించుకునే క్రమంలో బాబు కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే తన కుమారుడికి ఐటీ శాఖను కట్టబెట్టారో.. అదే తీరులో చంద్రబాబు సైతం తన కుమారుడు లోకేశ్ కు ఐటీ శాఖను అప్పగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఏపీని ఐటీ హబ్ గా చేయాలని తపిస్తున్న చంద్రబాబు.. అందులో భాగంగా ఆ శాఖను తన కుమారుడికి అప్పగించటం ద్వారా.. ఏపీలో ఐటీ రంగాన్ని పరుగులు తీయించగలరని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీపావళి తర్వాత చేపట్టే మంత్రివర్గ విస్తరణలో లోకేశ్ కు కేబినెట్ బెర్త్ పక్కా అన్న మాట బలంగా వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/