Begin typing your search above and press return to search.
కేసీఆర్ రేంజిలో చంద్రబాబు చెప్పట్లేదే!
By: Tupaki Desk | 9 Nov 2017 11:30 PM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒక కీలక విషయంలో.. ఒకే తరహా హామీలను ఇచ్చి ఇరుక్కుపోయారు. అయితే ఆ హామీలకు కట్టుబడి ఉండే విషయంలో.. మాత్రం ఇద్దరూ ఒకే తరహా శైలిని అనుసరించడం లేదు. అదేమిటా అనే అనుమానం కలుగుతోంది కదా! అవి కొత్తగా కొన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పించే వ్యవహారం. తెలంగాణలో కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తా అనే హామీతో ఆ వర్గం మద్దతు పొందగలిగారు. ఏపీలో చంద్రబాబునాయుడు.. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తాననే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈ రెండు ప్రభుత్వాలు ఆ దిశగా ఇప్పటిదాకా చేసింది పెద్దగా ఏమీలేదు. కానీ.. ప్రజలకు అనుమానం కలగకుండా.. భరోసా ఇచ్చేలా మాట ఇవ్వడంలో మాత్రం.. ఇద్దరు సీఎంల ధోరణి చెరో రకంగా ఉంది.
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ముస్లిం రిజర్వేషన్ ల అంశం పై చర్చ జరిగింది. కేసీఆర్ దీనిపై ఘాటుగా స్పందించారు. ‘ముస్లిం రిజర్వేషన్ లను ఇచ్చి తీరుతాం’ అని ఆయన తెగేసి చెప్పారు. ఇది కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నదని.. ఎట్టి పరిస్థితుల్లోను రిజర్వేషన్లు ఇస్తాం అని ఆయన ఘంటాపథంగా చెప్పారు.
కానీ కాపుల రిజర్వేషన్ విషయంలో చంద్రబాబునాయుడు ఇంత గట్టిగా ఎన్నడూ హామీ ఇచ్చింది లేదు. కాపులు ఎన్ని ఆందోళనలు చేసినా, లేదు తెదేపా కాపులు చంద్రబాబు భజన చేస్తూ మీటింగులు పెట్టి పొగిడినా ఆయన చెప్పే మాట మాత్రం ఒకటే.. ‘మంజునాధ కమిషన్ వేశాం.. కమిటీ సిఫార్సులు రాగానే దాని ప్రకారం చేస్తాం. లీగల్ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం’ అంటున్నారే తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చి తీరుతా అనే మాట చెప్పడం లేదు. ఫలానా తేదీలోగా ఆ సిఫారసుల్ని పూర్తిచేసి కేంద్రం పరిశీలనకు పంపుతా అనే మాట కూడా అనడం లేదు. ఇలా చంద్రబాబు చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది.
కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించే విషయంలో చంద్రబాబునాయుడు మోసం చేశారనే మాట చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. ముద్రగడ పద్మనాభం ఈ విషయంలో తీవ్రంగా పోరాడుతూనే ఉన్నారు. చంద్రబాబు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ అనుమానాలు మొత్తం కాపు వర్గంలోనూ ఈ అనుమానాలు ఉన్నాయి. అసలు ఏనాటికైనా ఇవాళ కేసీఆర్ చెప్పినంత ధాటిగా.. కాపులకు బీసీ రిజర్వేషన్ ఇచ్చి తీరుతా అనే మాట చంద్రబాబు నోటినుంచి వస్తుందా అని వారు ఎదురుచూస్తున్నారు.