Begin typing your search above and press return to search.
మోడీతో మీటింగ్: జగన్ - కేసీఆర్ ఏమన్నారంటే?
By: Tupaki Desk | 11 May 2020 2:22 PM GMTకరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ప్రధాని నరేంద్రమోడీ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో కుండబద్దలు కొట్టారు. కరోనా వల్ల రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని.. అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున కేంద్రం ఆదుకోవాలని సీఎంలు కేసీఆర్ - జగన్ లు మోడీని కోరారు.
*రుణాలను రీషెడ్యూల్ చేయాలి: కేసీఆర్
కరోనా వల్ల ఈ ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున రుణాలను రీషెడ్యూల్ ను చేయాలని సీఎం కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల రుణపరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. వలస కూలీలను అనుమతించకపోతే ఆందోళనలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలన్నారు.
కరోనా వైరస్ కు జులై - ఆగస్టు మాసాల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ తాజాగా ప్రధానికి సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అవ్వగా.. భారత్ నుంచి మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచే ఈ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.
దశల వారీగా ప్రయాణికుల రైళ్లను నడిపించేందుకు కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాజాగా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం సాధ్యం కాదన్నారు. కరోనాతో కలిసి బతకడం తప్పదని అభిప్రాయపడ్డారు.
*కరోనాతో కలిసి జీవించాల్సిందే..: ఏపీ సీఎం జగన్
రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. కరోనా సోకిన వ్యక్తులు స్వచ్ఛందంగా పరీక్షలకు ముందుకొచ్చే వాతావరణం కల్పించాలని జగన్ సూచించారు. ప్రస్తుతం కరోనా బాధితులు సాంఘికంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని సీఎం జగన్ అన్నారు.
కేంద్రం ఆర్థికంగా రాష్ట్రానికి సహకరించాలని ప్రధాని మోడీని ఏపీ సీఎం జగన్ కోరారు. లాక్ డౌన్ కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు జీవనోపాధిని కోల్పోయారని.. ఆర్థిక లావాదేవీలూ మందగించాయని మోడీకి జగన్ వివరించారు. వైద్య ఆరోగ్య - మౌళిక సదుపాయాల కల్పనకు తము 16 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలో లేకుండా రుణం మంజూరు చేస్తే వెసులుబాటు అవుతుందని కోరారు.