Begin typing your search above and press return to search.
జగన్, కేసీఆర్ ల ముందున్న సవాల్లెన్నో..?
By: Tupaki Desk | 2 July 2019 7:25 AM GMTఆంధ్ర, తెలంగాణ విడిపోయాయి. భౌగోళికంగా రెండు విడివిడి రాష్ట్రాలు.. కానీ అనాధిగా ఈ రెండు రాష్ట్రాల మధ్య తెగని పంచాయతీ ఉంది. అదే నీటిపంపకాలు. ఈ నీటిని పంచడానికి వీల్లేకుండా నదులున్నాయి. ప్రకృతి పరిహాసంలో ఎప్పటి నుంచో ఏపీ - తెలంగాణ రెండు నదుల నీటి కోసం కొట్లాడుకుంటున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ తాజాగా రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ముఖ్యంగా గోదావరి - కృష్ణా నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకోవాలని ప్రతిపాదించుకున్నారు. ఇందుకోసం గోదావరి నీటిని కృష్ణా నదిలోకి మళ్లించాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఒక జాయింట్ కమిటీని ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసి కలిసి ఈ ఎత్తిపోతల పథకాలు రూపొందించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇరు రాష్ట్రాల సీఎస్ లు భేటి అయ్యి చర్చలు జరిపారు. శ్రీకాకుళం - నాగార్జున సాగర్ లోకి గోదావరి నీటిని ఎత్తిపోయాలని దాదాపు నిర్ణయానికి వచ్చారు. అయితే అంతే బాగానే ఉన్నాయి. ఇక్కడే కొన్ని విప్పని చిక్కుముడులు ఉన్నాయని ఇరిగేషన్ శాఖ నిపుణులు ఘంటా పథంగా చెబుతున్నారు.
+ ప్రధానంగా ఇరిగేషన్ శాఖ నిపుణులు - ప్రాజెక్ట్ నిపుణులు లేవనెత్తుతున్న ప్రశ్నలివే..?
*గోదావరి నీటిని కృష్ణా బేసిన్ లోకి ఎత్తిపోయడానికి బ్యారేజీలు - సొరంగాలు - కాలువలు సహా ప్రాజెక్టులు నిర్మించాలి. వీటిని ఎవరు నిర్మించాలి.? నాగార్జున సాగర్ - శ్రీశైలం ప్రాజెక్టులు తెలంగాణలోనే ఉండడంతో ఏపీ సగం భరించి కలిసి నిర్మించినా హక్కు తెలంగాణకే ఉంటుంది.? అలాంటప్పుడు ఈ ప్రాజెక్టులను ఉమ్మడిగా నిర్మిస్తే ఎవరికి యాజమాన్య హక్కు ఉంటుంది.? భవిష్యత్ లో గొడవలొస్తే తెలంగాణకే లాభం కదా.?
*ఈ ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ భౌగోళికంగా తెలంగాణలోనే ఉన్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం పరిధిలోనే ప్రాజెక్టుల నిర్వహణ ఉంటుంది. నీటి కొరత ఏర్పడితే ముందుగా తెలంగాణకే వినియోగిస్తారు. అలాంటప్పుడు వీటికి ఏపీ ఎందుకు ఖర్చును భరించాలన్నది ప్రశ్న.
*ఇక గోదావరి నీటిని ఎత్తిపోసి కృష్ణా నది ప్రాజెక్టులు నింపడానికి కావాల్సిన విద్యుత్ ఏ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.?
*గోదావరి జలాల్లో వాటా ఉన్న కర్ణాటక - మహారాష్ట్రలు కృష్ణా జలాల్లోకి ఏపీ - తెలంగాణ మళ్లిస్తే ఆ రెండు రాష్ట్రాలు తమకూ వాటా కావాలని కేసులు వేస్తే ఏంటి పరిస్థితి.?
ఇలా ఏపీ - తెలంగాణ మధ్య నీటి కోసం దశాబ్ధాల అంతుచిక్కని ప్రశ్నలున్నాయి. అందుకే నీటి కోసం అనాధిగా పెద్ద యుద్ధమే జరిగింది. ఈ సున్నితమైన అంశం విషయంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడం అంత తేలిక కాదు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడం కూడా కేసీఆర్ - జగన్ - అధికారులకు అంత సులువైన విషయం కాదు. మరి జగన్ - కేసీఆర్ ఎలా ముందుకెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.