Begin typing your search above and press return to search.
మోడీ ఆ ఫైల్ కదిపితే.... ఒక్క దెబ్బకు జగన్ కేసీయార్ ....?
By: Tupaki Desk | 11 Oct 2022 2:30 AM GMTఆ ఫైల్ కేంద్రం కదుపుతుందా. దాని మీద యాక్షన్ తీసుకునే సమయం ఇపుడు వచ్చిందా అంటే అవును అంటోంది ఢిల్లీ కబురు. రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలని విభజన చట్టంలో ఉంటే దాన్ని తొక్కి పాతరేసిన బీజేపీ సర్కార్ ఇపుడు సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు వస్తూండడంతో పాత ఫైల్ బూజు దులుపుతోంది అని వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం శాఖ దీని మీద సీరియస్ గానే దృష్టి సారించింది అని అంటున్నారు.
నిజానికి రాష్ట్ర పునర్‌విభజన చట్టం షెడ్యూల్ 10లో పేర్కొన్న ప్రకారం ఉన్న సీట్లను పెంచి స్టేబుల్ గవర్నమెంట్ రెండు చోట్ల ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉంది. దాని మేరకు ఏపీలో 175 సీట్లను 225 సీట్లుగా అలాగే తెలంగాణాలో 119 సీట్లను 15ఎ సీట్లుగా పెంచాల్సి ఉంది. అయితే ఈ ఫైల్ కి బూజు పట్టేసి అటక మీదకు చేరిపోయింది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నిల్. అందువల్ల బీజేపీకి ఏ మాత్రం ప్రయోజనం లేని ఈ విషయం లో ఆయాసం ఎందుకు అని అలా ఉంచేశారు.
సరే అది అలా అటక మీద ఉంటే అడిగేవారు లేరు కానీ ఈ లోగా ఆదరాబాదరగా కాశ్మీరులో మాత్రం ఎన్నికలను తమ రాజకీయ లాభాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్లను పెంచేశారు. దాంతో అక్కడ అడ్డంగా బీజేపీ దొరికేసింది. ఈ పరిణామం కలసిరావడంతో సుప్రీం కోర్టులో దీని మీద కేసు దాఖలు చేశారు. ఈ వివక్ష ఏంటి, తెలుగు రాష్ట్రాలలో ఎనిందేళ్ళుగా సీట్ల పెంపు లేదు, అదే కాశ్మీరు లో అయితే మూడేళ్లలోనే కధ స్పీడ్ గా సాగింది అంటూ కేసు పడడంతో దాన్ని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ వారంలో ఆ కేసు విచారణకు రానుండగా ఇపుడు కేంద్రం కూడా ఆలోచనలో పడింది అంటున్నారు. దాంతో హోం శాఖ ఈ ఫైల్ ని బయటకు తీసింది అంటున్నారు. ఇదిలా ఉండగా సీట్ల పెంపు జరిగితే ఏపీలో జగన్ కి తెలంగాణాలో కేసీయార్ కి లాభం. ఈ ఇద్దరికీ ఈ ఎన్నికల్లో గరిష్టంగా మేలు జరగనుంది. అసెంబ్లీ సీట్లు పెరిగితే ఏపీలో కొత్తగా యాభై సీట్లు వస్తాయి. అలాగే తెలంగాణాలో 34 సీట్లు దఖలు పడతాయి. అలా అసంతృప్తి అన్న మాట లేకుండా వైసీపీ టీయారెస్ పార్టీలు సీట్లను తమవారికి అలా ఇచ్చేస్తారు అన్న మాట. ఆ విధంగా గెలిచేందుకు మళ్లీ ఈ రెండు పార్టీలకు అవకాశం ఉంటుంది.
దాంతో ఈ రెండు పార్టీలతో పాటు రెండు ప్రభుత్వాలు కూడా సుప్రీం కోర్టులో సీట్ల పెంపు మీద తమ వాదనలను బలంగా కలసికట్టుగా వినిపించేందుకు రెడీ అవుతున్నాయట. సో ఇపుడు సుప్రీం కోర్టు కనుక కేంద్రాన్ని ఆదేశిస్తే కచ్చితంగా సీట్లను పెంచాల్సిందే. సో మోడీ మీద చాలా కాలానికి పై చేయి సాధించేందుకు కూడా కేసీయార్ జగన్ లకు అవకాశం ఏర్పడింది. సో సీట్ల పెంపుతో ఈసారి ఎన్నికల గోదావరిని ఈదేయవచ్చు అన్నదే ఈ రెండు పార్టీల ఆలోచనగా ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.