Begin typing your search above and press return to search.
జగన్ని కూడా లాగేస్తారా... తాడేపల్లి ఎంత దూరం...?
By: Tupaki Desk | 3 Sep 2022 2:30 AM GMTఒక తెలుగు ముఖ్యమంత్రి కేంద్రం మీద అతి పెద్ద యుద్ధం ప్రకటించారు. మోడీ అంటేనే ఆయన పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. దేశంలో యాంటీ బీజేపీ కూటమి కట్టాలని తెగ ఉబలాటపడుతున్నారు. అందుకోసం ప్రత్యేక విమానం కట్టుకుని దేశమంతా కలియతిరుగుతున్నారు. మోడీ లేని రాజ్యం దేశంలో రావాలని కోరుకుంటున్నారు. ఇక బీజేపీ విముఖత దేశం అంటూ చాలా పెద్ద మాటనే కేసీయార్ వాడారు. నిజంగా ఈ తరహా మాటలు కాషాయం పార్టీ పెద్దలకు కషాయం తాగించినట్లే అనుకోవాలి.
ఈ మధ్యనే బీహార్ దాకా వెళ్లివచ్చారు కేసీయార్. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ఆయన మనసారా అభినందించారు. అక్కడ బీజేపీ వ్యతిరేక గళాన్ని చాలా గట్టిగా వినిపించారు. అంతకు ముందు కూడా ఆయన కేజ్రీవాల్ ని కలిశారు. శరద్ పవార్ తో ముచ్చట్లు పెట్టారు. అఖిలేష్ యాదవ్ తో భేటీలు వేశారు. లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తో కూడా స్నేహం చేస్తున్నారు.
ఇవన్నీ బాగా ఉన్నాయి కానీ సాటి తెలుగు రాష్ట్ర ఏపీకి ఎపుడు కేసీయార్ వస్తారు అన్నదే చర్చగా ఉంది. అందుకోసం ఆయన ప్రత్యేక విమానం తాడేపల్లి దిశగా ఎపుడు ఎగురుతుంది అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి కేసీయార్ జగన్ మంచి దోస్తులు, 2019 ఎన్నికల వరకూ ఆ బంధం బహు గట్టిగా సాగింది. జగన్ సీఎం గా ప్రమాణం చేస్తే దానికి చీఫ్ గెస్ట్ గా కేసీయార్ అటెండ్ అయ్యారు.
ఆ తరువాత ఒక ఆరు నెలల పాటు ఈ బంధం చూడ ముచ్చటగా సాగింది. మరి కేంద్ర పెద్దలకు కన్ను కుట్టిందో ఏమో కానీ జగన్ని దగ్గర తీసి కేసీయార్ తో దూరం పెంచారని అంటారు. అయినా సరే బయటకు కనిపించని స్నేహం వారి మధ్యన ఇంకా ఉందనే అంతా నమ్ముతున్నారు. దాని మీద కేంద్ర బీజేపీ పెద్దలకు కూడా డౌట్లు ఉన్నాయని అంటారు.
ఇక కేసీయార్ ఓపెన్ అయిపోయారు. మోడీ హఠావో అంటున్నారు. జగన్ కి ఇపుడిపుడే బీజేపీ సెగ తగులుతోంది. అందుకే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీటింగునకు ఫస్ట్ టైమ్ డుమ్మా కొట్టారు. ఇక రానున్న రోజులలో బీజేపీ టీడీపీ దోస్తే బలపడితే కచ్చితంగా జగన్ కూడా ఓపెన్ అవుతారు అని అంటున్నారు.
ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి. జగన్ని బీజేపీ కాస్తా దూరం పెడుతూంటే సీపీఐ నారాయణ లాంటి వారికి జగన్ తమకు కొత్త మిత్రుడిగా కనిపిస్తున్నారు. ఆయన ఇప్పటికి కొన్ని సార్లు తన మనసులోని మాటను బయటపెట్టుకున్నారు. బీజేపీని వీడి జగన్ బయటకు రావాలని కోరుకున్నారు. ఇక ఈ మధ్యనే హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ జగన్ని కూడా యాంటీ మోడీ కూటమిలోకి తీసుకురావాలని కేసీయార్ కి సూచించారు.
తెలంగాణాలో కమ్యూనిస్టు పార్టీలు ఇపుడు టీయారెస్ తో దోస్తీ చేస్తున్నాయి. ఏపీలో అయితే వారికి ఇంకా మిత్రులు దొరకలేదు. ఒకవేళ టీడీపీ బీజేపీ మిత్రులుగా ముందుకు వస్తే కచ్చితంగా జగనే వారికి మిత్రుడు అవుతారు. రాజకీయాల్లో ఏదీ అనూహ్యం కాదు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీల చూపు జగన్ మీద ఉంది అంటున్నారు.
ఎటూ కేసీయార్ తో జగన్ కి మంచి దోస్తి ఉంది కాబట్టి తన పలుకుబడి ఉపయోగించి జగన్ని కూడా ఈ వైపు లాగేయాలని కోరుకుంటున్నారు. మరి అది జరుగుతుందా. కేసీయార్ స్పెషల్ ఫ్లైట్ తాడేపల్లి రూట్లోకి వచ్చేదెపుడు. జగన్ తో భేటీ వేసేదెపుడు. ఆ ముహూర్తం ఎపుడు అంటే రాజకీయ వెండి తెర మీద వేచి చూడాల్సిందే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.