Begin typing your search above and press return to search.
బీఆర్ఎస్ లోకి 'ఏపీ కాపులు'.. కేసీఆర్ -జగన్ స్కెచ్ అదేనా..?
By: Tupaki Desk | 2 Jan 2023 5:17 AM GMTటీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా అవతరించింది. బీఆర్ఎస్ ను విస్తరించేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ముందుగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో పాగా వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. బీఆర్ఎస్ ను ఆంధ్రలో విస్తరించేందుకు ఇప్పటికే కొంతమంది స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన ముఖ్య నేతలు సోమవారం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరిలో ప్రధానంగా తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారధి, ప్రకాశ్ తదితరులు ఉన్నారు. తోట చంద్రశేఖర్, పార్థసారధిలు ఇప్పటి వరకు జనసేన పార్టీలో కొనసాగారు. ఇప్పుడు బీఆర్ఎస్ తరుపున పనిచేసే అవకాశం ఉంది. అయితే ఏపీలోని కాపు ఓట్లను ప్రభావితం చేయడానికి ఆ వర్గానికి చెందిన నాయకుడైన తోట చంద్రశేఖర్ కు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్ బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి కేసీఆర్ పెద్ద స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు ఇంతకాలం కాపు ఉద్యమాలతో ఆ వర్గం వారు వైసీపీకి దూరమవుతున్నారనుకున్నారు. కానీ బీఆర్ఎస్ వారికి ప్రాధాన్యం ఇచ్చి జగన్ కు మేలు చేయనున్నారా..? అన్నది చర్చ నీయాంశంగా మారింది.
ఏపీలో కాపు ఓట్లు కీలకం. వారి మద్దతు ఉంటే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయొచ్చు. గత ప్రభుత్వాలన్నీ వారి మద్దతుతోనే సాగాయి. వైసీపీ సైతం కాపుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అయితే ఇటీవల తమకు రిజర్వేషన్లు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చేగొండి హరిరామ జోగయ్య నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నిరాహార దీక్షకు కూడా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఆ వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ కు ఏపీ పార్టీ బాధ్యతలను అప్పగించేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం.
తోట చంద్రశేఖర్ ప్రజారాజ్యం తరుపున 2009లో గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2014లో వైసీపీ తరుపున ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో జనసేన తరుపున గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి కూడా గెలవలేదు. అయితే ఇప్పుడు ఆయనకు బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడా చర్చనీయాంశంగా మారింది. మరో నేత రావెల కిశోర్ బాబు మాజీ మంత్రిగా పనిచేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన టీడీపీ పార్టీలో కొనసాగారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి కూడా బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈయన జనసేన పార్టీ తరుపున పనిచేశారు.
వ్యాపార వేత్త ప్రకాశ్ సైతం గులాబీ కండువా కప్పుకోనున్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన కూడా జనసేనలో యాక్టివ్ గా ఉండేవారు. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీరే కాకుండా గుంటూరు జిల్లాలోని మమ్మిడి వర్గానికి చెందిన బంగార్రాజు, రాజేశ్ కుమార్, కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు, రమేశ్, రామచంద్రపురానికి చెందిన జేవి రావు, అవిడికి చెందిన శ్రీనివాస్ తదితరులు బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన వారే బీఆర్ఎస్ లో చేరుతున్నారు. కానీ వైసీపికి చెందిన వారి లిస్టు ఎక్కడా కనిపించడం లేదు.
ఏపీలో ఇంతకాలం బీసీలు తమను పార్టీలు వాడుకుంటున్నారని, కానీ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వారికి ప్రాధాన్యం ఇస్తూ పార్టీ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకున్నా ప్రభావిత సీట్లు వస్తే మాత్రం ప్రభుత్వ ఏర్పాటు లో కీలకం కానున్నారు. అటు జగన్ సాధించలేని సీట్లను బీఆర్ఎస్ గెలిపించి ఆయన ఖాతాలో వేయనుందా..? అనేది చర్చ సాగుతోంది. మొత్తంగా కాపు, బీసీ ఓట్లను ఇతర పార్టీలకు వెళ్లకుండా కేసీఆర్, జగన్ స్కెచ్ వేశారా..? అని అనుకుంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ బీసీ ఓట్లను గనుక కేసీఆర్ ప్రభావితం చేస్తే మాత్రం వైసీపీ మినగా మిగతా పార్టీలకు గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.