Begin typing your search above and press return to search.

జెండా పండుగ : ఆయన నీరు .. ఈయన నిప్పు...

By:  Tupaki Desk   |   27 April 2022 2:51 PM GMT
జెండా పండుగ : ఆయన నీరు .. ఈయన నిప్పు...
X
రెండు ద‌శాబ్దాల ప్ర‌స్థానం త‌రువాత పెద్దాయ‌న త‌న స్పీడు త‌గ్గించారు. ఎందుకనో ఆ వేగం లేదు. ఆ వాదం లేదు. ఆ ప‌ఠిమ కూడా లేదు. క్షేత్ర స్థాయిలో వాస్త‌విక ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేయ‌కుండా కొంత అతి విశ్వాసం తో అక్క‌డ‌క్క‌డా మాట్లాడినా తాను ఏ పార్టీకీ వ్య‌తిరేకం కాద‌ని చెప్పారు.

ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఓ కొత్త పార్టీ కి సంబంధించి సంకేతాలు ఇచ్చారు.. అందుకు తాను సిద్ధం అని చెప్పారు.. ఇవ‌న్నీ ఉద్యమ స్ఫూర్తిని నింపే విధంగానో లేదా ఓ కొత్త మార్పును తెచ్చే నాయ‌కుడిగానే ఆయ‌న మాట్లాడితే బాగుండు కానీ ఆయన వాయిస్ ఛేంజ్ అయింది. ఎందుక‌నో తగ్గారు. ఎందుక‌నో మిగ‌తా వారిని విరోధులుగా చూడ‌డ కూడా మానుకున్నారు. పార్టీ ప్లీన‌రీలో కార్య‌క‌ర్త‌ల‌కు ఉత్సాహం నింపింది కేటీఆర్ కానీ కేసీఆర్ కాదు అని కూడా తేలిపోవ‌డం ఇవాళ్టి విశేషం.

తెలంగాణ ప్లీన‌రీ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడారు. జాతీయ స్థాయిలో రాజ‌కీయాలు నెర‌పేందుకు త‌న‌ని తాను సిద్ధం చేసుకుంటున్న వైనాన్ని వివ‌రించారు. ఎందుక‌నో ఇవాళ వెరీ సాఫ్ట్ స్పోకెన్ ప‌ర్స‌న్ గానే ఉన్నారు. యాక్టివ్ గా కూడా లేరు. వివాదాల‌కు దూరంగా త‌న స‌హ‌జ శైలికి కూడా దూరంగా పెద్ద‌గా ఏ ఇబ్బంది ఎవ్వ‌రికీ రానివ్వ‌కుండా నొప్పించ‌క తానొవ్వ‌క అన్న రీతిలోనే మాట్లాడారు.

ముఖ్యంగా ఇవాళ దేశానికి ప్ర‌త్యామ్నాయ కూట‌మి క‌న్నా ప్ర‌త్యామ్నాయ విధానాలు ఉన్న నాయ‌క‌త్వం కావాల‌ని ప‌దే ప‌దే చెప్పారు. ఆ విధంగా శ్రేణులకు సైతం దిశానిర్దేశం చేశారు. ఇర‌వై ఏళ్ల‌కు పైగా త‌మ‌ పార్టీని న‌డిపిన వైనాన్ని ఆయ‌న స్మ‌రించుకున్నారు. అదేవిధంగా ఉద్య‌మ చ‌రిత్ర‌ను సైతం ఉటంకించారు. కానీ కేటీఆర్ మాత్రం ఆయ‌న‌కు పూర్తి భిన్నంగా మాట్లాడారు.

కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించారు. ఓ విధంగా కేటీఆర్ స్పీచ్ లో పొలిటిక‌ల్ పంచ్ లు కానీ సెటైర్లు కానీ ఎక్కువ‌గానే ఉన్నాయిప‌. మాట్లాడితే మోడీని ప్ర‌శ‌సించేందుకు సిద్ధం అయ్యే నేత‌లు తాము క‌ట్టిన కాళేశ్వరంను ఎందుకు ప్ర‌శంసించ‌డం లేదు అని అన్నారు. ఉన్న ఉద్యోగాల‌ను తీసి వేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా పెద్దాయ‌న క‌న్నా తార‌క రామారావే కాస్త క‌టువుగా మాట్లాడి స‌భికుల మ‌న్న‌నలు అందుకున్నారు. బీజేపీ చేతిలో అధికారం దేశానికే అంధ‌కారం అని గ‌తంలో వినిపించిన నినాదాలే మ‌రో సారి వినిపించారు. ధ‌ర‌ల ద‌రువు పై మ‌రోసారి ప్ర‌స్తావించి కేంద్ర ప్ర‌భుత్వ తీరును విమ‌ర్శించారు.

ఇదే సంద‌ర్భంలో ఇవాళ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ ప‌రిణామాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తోంది. ఏదేమ‌యినప్ప‌టికీ పెద్దాయ‌న నీరు.. చిన్నాయ‌న నిప్పు అని తేలిపోయింది. ఇక ఈ జోరు ఈ హోరు పెద్దాయ‌న దీవెన‌ల‌తో మున్ముందు కూడా కొన‌సాగిస్తారా కేటీఆర్ ?