Begin typing your search above and press return to search.
ఆ ఇష్యూలో కేసీఆర్..కేటీఆర్ వ్యాఖ్యలకు లింకు కలవట్లేదబ్బా?
By: Tupaki Desk | 16 Sep 2019 5:53 AM GMTఏదైనా విషయం మీద ప్రకటన చేసినా.. స్పందించినా.. ఒక రాజకీయపార్టీ దాదాపు ఒకేలాంటి స్టాండ్ మీద ఉంటుంది. నేతలు ఎవరైనా.. వారి వాదన ఒకేలా ఉంటుంది. రాజకీయ పార్టీ తీరే ఇలా ఉంటే.. అధికారపక్షం వైఖరి మరెలా ఉంటుంది? అందులోకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు కేటీఆర్ వ్యాఖ్యలు ఒకేలా ఉంటాయని అనుకుంటాం.
ఆసక్తికరంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన యురేనియం తవ్వకాల విషయంలో తండ్రీకొడుకులు వేర్వేరు సందర్భాల్లో.. వేర్వేరు వేదికల మీద మాట్లాడిన మాటల మధ్య లింకు మిస్ కావటం ఆసక్తికరంగా మారింది. రోటీన్ కు భిన్నంగా యురేనియం తవ్వకాల మీద కేసీఆర్.. కేటీఆర్ వ్యాఖ్యలు భిన్నంగా ఉండటం ఒక ఎత్తు అయితే.. ఏ అంశాల మీద కేటీఆర్ నిందలు వేశారో.. సరిగ్గా అవే అంశాల మీద కేసీఆర్ అవును.. నిజమే అన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం ఆశ్చర్యాన్ని కలిగించేలా చేస్తోంది.
యురేనియం తవ్వకాలపై కేటీఆర్ బంతిని కేంద్రం కోర్టులోకి వేస్తే.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా అనుమతులు ఇవ్వం.. తవ్వకాలపై కేంద్రం పట్టుబడితే కోట్లాడతామని స్పష్టం చేశారు. తొలిసారి తండ్రికొడుకుల మధ్య ఒకే విషయం మీద మాట్లాడిన మాటల్లో వైరుధ్యం కనిపించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఆదివారం ఉదయం మండలిలో యురేనియం మీద కేటీఆర్ మాట్లాడితే.. మధ్యాహ్నం వేళలో అసెంబ్లీలో యురేనియం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ అంశం మీద తండ్రికొడుకులు చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి తీసుకుంటే.. విషయం ఇట్టే అర్థం కాక మానదు.
ఉదయం మండలిలో కేటీఆర్ మాటల్లో ప్రధానాంశాల్ని చూస్తే..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్(ఏఎండీ) యురేనియం అన్వేషణ చేపట్టలేదు. నల్లమలలోని 2 వేల హెక్టార్లలో యురేనియం అన్వేషణకు 2009లో జీవో నంబరు 127 ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం అన్వేషణకు మాత్రమే అనుమతి ఇవ్వాలని 2016లో రాష్ట్ర వన్యప్రాణి మండలి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఒకవేళ యురేనియం ఉందని తేలితే తవ్వకాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దనే షరతును విధించింది. సుమారు 18,550 మెట్రిక్ టన్నుల యురేనియం నిక్షేపాలున్నాయని గుర్తించారు. యురేనియాన్ని విద్యుత్తు శక్తికే వాడరు. అణు రియాక్టర్లలో ఉపయోగిస్తారు. అంతరిక్ష ప్రయోగాలకు ఇంధనంగా వాడతారు. కేంద్ర ప్రభుత్వం చెడు ఉద్దేశంతో యురేనియం అన్వేషణకు అనుమతి ఇవ్వలేదు. దేశంలో అంతరిక్ష పరిశోధనలు జరగాలి. మనం అణ్వాయుధాలను సమకూర్చుకోవాలి. భారతదేశ రక్షణలో రాజీలేకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.
సీఎం కేసీఆర్ పర్యావరణ ప్రేమికుడు. యురేనియం తవ్వకాలపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలను అనుమతించబోరు. కాంగ్రెస్ నేతలు.. కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు లేనిపోని వార్తలు రాస్తున్నాయి. ఇది నీచం.. అత్యంత బాధ్యతారాహిత్యం. ఓ పత్రికలో యురేనియం తవ్వకాలు జరిగినట్లు.. కోటి మంది ప్రజలున్న హైదరాబాద్‌కు ముప్పు వాటిల్లుతున్నట్లు రాశారు. ఇలాంటి సున్నితమైన వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్లోని ప్రధానాంశాలు చూస్తే..
రాష్ట్రంలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వబోము. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎవరికీ ఏ విధమైన అనుమతులూ ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇచ్చే ఆలోచన కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో నల్లమల అడవులను నాశనం కానివ్వం. యురేనియం తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం పట్టుబడితే వ్యతిరేకంగా కొట్లాడదాం. పోరాటం చేద్దాం.
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు సీఎస్ చేయాలి. మంగళవారం సభలో ఈ అంశాన్ని చర్చించేలా ఏర్పాట్లు చేయాలి. యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని చెప్పినా.. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని కడపలో యురేనియం తవ్వకాలు చేపట్టటంతో ఆ ప్రాంతమంతా కలుషితమవుతోందంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల రైతాంగానికి అన్నం పెట్టే కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం - సాగర్ - పులిచింతలతో పాటు డెల్టా ప్రాంతమంతా కలుషితమై నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. కృష్ణా నుంచి హైదరాబాద్ కు వచ్చే తాగునీరు కూడా కలుషితమవుతుంది.