Begin typing your search above and press return to search.
కొడుకు మాటకు నో చెప్పిన కేసీఆర్
By: Tupaki Desk | 26 Jan 2016 6:51 AM GMTప్రతిష్టాత్మక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసేందుకు వారం రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు తెరమీదకు వస్తున్నాయి. దాదాపు ప్రధాన పార్టీల నేతల ప్రచారంపై క్లారిటీ వచ్చినప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. కొత్త విధానంలో ప్రచారం చేపట్టాలని సీఎం తనయుడు కేటీఆర్ ప్రతిపాదించగా...దానికి కేసీఆర్ నో చెప్పినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ముఖ్యులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచార తీరు, పార్టీ పరిస్థితి ఎలా ఉందనే దానిపైనా సమీక్ష జరిపారు. రెండు మూడు బహిరంగ సభలు, వినూత్న తరహాలో ఈ-సభలు నిర్వహించేందుకు ఈ సందర్భంగా ప్రతిపాదన వచ్చింది. అయితే సీఎం హోదాలో బహిరంగ సభలు ఎక్కువైతే ట్రాఫిక్ చిక్కులు తలెత్తి ప్రయోజనం కన్నా విమర్శలు ఎక్కువ వస్తాయనే అభిప్రాయం చర్చలో వ్యక్తమైంది. దీంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తే సరిపోతుందన్న నిర్ణయానికి వచ్చారు.
మరోవైపు ఈ దఫా ఈ సభలు నిర్వహించడం పక్కనపెట్టి టీవీల్లో ముఖాముఖి నిర్వాహించాలన్న ప్రతిపాదన రాగా దానిని తోచిపుచ్చారు. అయితే మరో కోణంలో ఓటర్లకు చేరువ అయ్యే నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టులు - మీడియా రంగంలోని ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించి తెలంగాణ భవన్ లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికను సుదీర్ఘంగా వివరిస్తారు. ప్రతి ఇంటా టీవీ ఉంటుంది కనుక, ఆ మాధ్యమాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటే పార్టీ వాదన బలంగా ప్రజల్లోకి వెళ్తుందని పార్టీ నేతలు అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే బహిరంగ సభలు ఎక్కువగా నిర్వహించడంకన్నా ముఖ్యమంత్రి టీవీలో మాట్లాడడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు.
27న తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన తరువాత 30న సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహణకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలవల్ల బహిరంగ సభకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదు. 30నాటి సభకు 29న ఒక్కరోజులోనే ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. గ్రేటర్ నోటిఫికేషన్ కు ముందునుంచే వ్యూహాత్మక ప్రచారాన్ని నిర్వహించిన తెరాస, ప్రచారానికి ఫినిషింగ్ టచ్ లా కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో తెరాస సర్కారు ఏం చేసింది, ఏం చేయబోతోంది వివరిస్తూ, ఇప్పటి వరకు పాలించిన వాళ్లు ఏంచేశారో కేసీఆర్ వివరించే అవకాశం ఉందని సమాచారం.