Begin typing your search above and press return to search.
మామ కేసీఆర్ - బామ్మర్ధి కేటీఆర్ ను మించిన హరీష్
By: Tupaki Desk | 23 Oct 2018 5:30 AM GMTమామ కేసీఆర్ నిర్లక్ష్యం చేయవచ్చు.. బావమరిది కేటీఆర్ పార్టీలో ఎదగనీయకుండా చేయవచ్చు. కానీ హరీష్ రావు ఇప్పటికీ టీఆర్ ఎస్ పార్టీకి దీర్ఘకాలిక విశ్వసపాత్రుడిగా అందరి మనసులు చూరగొంటున్నాడు. పార్టీ అధినేత తనను పక్కనపెట్టినప్పటికీ.. పార్టీ నిర్లక్ష్యం చేసినప్పటికీ మామ కేసీఆర్ ను ఆపద సమయంలో రక్షించడంలో ఎప్పుడూ ముందుంటాడని నిరూపిస్తున్నారు. మెరుపు వేగంతో పనిచేసే హరీష్ రావు... కేసీఆర్ కు సొంత నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగలగా.. తన చాకచక్యంతో గంటల వ్యవధిలోనే పరిస్థితిని మామకు అనుకూలంగా ఔరా అనిపించాడు. మామను మించిన వ్యూహకర్తగా ప్రశంసలు పొందుతున్నాడు.
కేసీఆర్ కంటే కూడా హరీష్ రావు రాజకీయాల్లో ఎంత చురుకో.. ఎంత వేగంగా స్పందించి మామను రక్షించాడో తెలిపే తాజా ఘటన ఒకటి గజ్వేల్ లో చోటుచేసుకుంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ కీలక నేత - మాజీ గజ్వేల్ మండల పరిషత్ ప్రెసిడెంట్ ఎంసీ రాజయ్య సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొన్ని గంటలు ప్రచారం కూడా చేశారు. ఈ పరిణామంపై విస్తుపోయిన కేసీఆర్ పలుమార్లు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించినా ఫలితం రాలేదు. ఇప్పుడే హరీష్ రావు వేగంగా స్పందించారు. గజ్వేల్ వెళ్లి ఆ నేతను కలిసి అన్ని హామీలిచ్చి తిరిగి టీఆర్ ఎస్ పార్టీలో చేర్పించారు. మధ్యాహ్నం కల్లా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన రాజయ్య.. అదే కాంగ్రెస్ ను తిట్టేలా హరీష్ రావు చేయగలిగారు. కొన్ని గంటల్లోనే పరిస్థితిని కేసీఆర్ కు అనుకూలంగా మార్చేసిన ట్రబుల్ షూటర్ హరీష్ స్టామినాకు ఈ ఘటన మచ్చుతునక అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇలా చేయడం హరీష్ రావుకు ఇదే మొదటిసారి కాదు.. కొంతకాలం క్రితం కూడా గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ నేతలు - వట్టిపట్టి ఎంపీటీసీ కే . కవిత - ఇటిక్యాల సర్పంచ్ ఐలయ్య - సీనియర్ నేత యాదగిరిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక్కరోజులనే హరీష్ రావు వారిని కలిసి నచ్చజెప్పి - బుజ్జగించి తిరిగి టీఆర్ ఎస్ పార్టీలో చేర్పించారు. వారంతా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరగా.. మరుసటిరోజే హరీష్ రావు వారిని తిరిగి టీఆర్ ఎస్ లో చేర్పించేలా చేశారు.
హరీష్ రావు పూర్వపు మెదక్ జిల్లాలో ఎలాంటి చిన్న సంఘటన జరిగినా.. టీఆర్ ఎస్ కు నష్టం జరిగే ఏ ఘటన అయినా వేగంగా స్పందిస్తూ పార్టీకి లాభం చేకూరేలా చకచకా నిర్ణయాలు తీసుకుంటూ సత్తా చాటుతున్నారు. ఇదే కాదు ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు - మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరు టీఆర్ ఎస్ జడ్పీటీసీలను కాంగ్రెస్ లో చేర్చాలని ప్రయత్నించినప్పుడు హరీష్ రావు వేగంగా స్పందించి వారిని పార్టీ మారకుండా చేయడంతోపాటు ముగ్గురు కాంగ్రెస్ కీలక నేతలను కూడా టీఆర్ ఎస్ లోకి తీసుకొచ్చి ఆమెకు గట్టి షాక్ ఇచ్చాడు.
ఇలా రాజకీయాలు చేయడంలో నడిపించడంలో కేసీఆర్ - కేటీఆర్ ను మించి హరీష్ రావు రాటుదేలాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావును ఉపయోగించుకోకపోతే నష్టం కేసీఆర్ - టీఆర్ ఎస్ కే కానీ.. హరీష్ కు ఎంత మాత్రం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.