Begin typing your search above and press return to search.
మోడీ కంటే కేసీఆర్ కోటి రెట్లు బెటరా?
By: Tupaki Desk | 22 Oct 2015 11:30 AM GMTఅమరావతి శంకుస్థాపన కార్యక్రమం అనుకున్నట్లే ఘనంగా జరిగిపోయింది. ప్రధాని మోడీ ప్రత్యేక అతిధిగా వస్తున్న నేపథ్యంలో అమరావతి శంకుస్థాపన సందర్భంగా భారీ తాయిలం కాకున్నా.. ఏదో కొన్ని వరాలు ప్రకటించి సీమాంధ్రుల మనసుల్ని దోచుకుంటారని భావించారు. ఇందుకు తగ్గట్లే చాలానే ఆశలు పెట్టుకున్నారు.
ఇక. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వస్తున్నారని తెలిసినప్పుడు చాలామంది సీమాంధ్రులు నమ్మింది లేదు. ఆయన ఇలానే చెబుతారని.. వచ్చినప్పుడు చూద్దామన్న మాటలు కూడా వినిపించాయి. కానీ.. చాలామంది సందేహాలు ఉత్తవేనని తేలుస్తూ అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వచ్చారు. రావటమే కాదు.. సీమాంధ్రప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
వేదిక మీద ఉన్న వారి పేర్లను చదివి చెప్పినంత సమయమే తన ప్రసంగాన్ని చేసిన కేసీఆర్.. ఈ సందర్భంగా ఒక్కమాటలో ఏపీకి తానేం చేయగలనన్న విషయాన్ని చెప్పేశారు. ఏపీ రాజధాని అమరావతికి అవసరమైన ఏ సాయాన్ని అయినా తెలంగాణ సర్కారు చేస్తుందన్న భరోసాను ఇచ్చేశారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎన్నో ఆశలు పెట్టుకున్న మోడీ.. చేతికి కాసింత మట్టి.. కాసింత యమున నీళ్లు ఇచ్చి వెళ్లిపోతే.. ఎలాంటి అంచనాలు లేని కేసీఆర్ మాత్రం.. అందుకు భిన్నంగా అమరావతికి అవసరమైన ఏ సాయాన్ని అయినా తాము చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ సాయం చేస్తారా? లేదా? అన్నది తర్వాత.. కానీ.. ఆయన నోటి నుంచి ఒక మాట అయితే వచ్చింది. కానీ.. విభజన కారణంగా ఏపీకి ఎంతో నష్టం జరిగిందని వాపోయిన మోడీ మాత్రం విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేరుస్తామని చెబుతూ వెళ్లిపోయారు. వీరిద్దరిని చూస్తే.. మోడీ కంటే కేసీఆర్ కోటి రెట్లు బెటర్ అనిపించక మానదు.