Begin typing your search above and press return to search.
బాబు బొమ్మాళీ....నిన్ను వదలా
By: Tupaki Desk | 27 Sep 2018 10:18 AM GMTతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అన్నీ విధాల ఇబ్బందుల పాలు చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడి ప్రధాన అనుచరుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసును తిరగతోడుతోంది. దీని ద్వారా అటు చంద్రబాబు నాయుడిని - ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలనే ద్విముఖ వ్యూహానికి తెర తీసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఇంటిపైన - ఆయన బంధువుల ఇళ్ల పైన ఇన్ కం టేక్స్ దాడులు చేపట్టింది. ఓటుకు నోటు కేసులో అప్పట్లో రేవంత్ రెడ్డి - చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి పోయారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి జైలుకి కూడా వెళ్లారు. ఈ సంఘటన జరిగి రెండు సంవత్సారాలు దాటింది. తెలుగు ప్రజలందరూ ఓటుకు నోటు కేసును దాదాపు మరచిపోయారు. ఇలాంటి సందర్భంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న వేళ ఓటుకు నోటు కేసును తెరపైకి తీసుకు వచ్చింది.
ఈ ఓటుకు నోటు కేసు తిరగతోడడం వెనుక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పాత్ర ఉన్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఓటమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అన్నీ అస్త్రాలు ప్రయోగిస్తోంది. బుధవారం నాడు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులను పార్టీలోకి ఆహ్వానించింది. రేవంత్ రెడ్డిని ఓడించే బాధ్యతను సీనియర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించారని తెలుస్తోంది. ఒకవైపు ఈ వ్యూహరచన అమలు చేస్తూనే భాజపా సాయంతో చంద్రబాబు నాయుడికి కూడా గట్టి దెబ్బ తగిలేలా చేయాలన్నది కేసీఆర్ - మోదీల వ్యూహంలా కనుబడుతోంది. భారతీయ జనతా పార్టీకి - తెలంగాణ రాష్ట్ర సమితికి లోపాయికారి ఒప్పందం ఉందని జరుగుతున్న ప్రచారానికి నిదర్శనం ఈ ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రావడమేనని అంటున్నారు. ఏ అవకాశం వచ్చిన వదులుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడిని - తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని రహస్య మిత్రుల వ్యూహంగా చెబుతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలలో తెరాసాను గద్దె దించేందుకు ఏకమవుతున్న మహాకూటమిని మానసీకంగా దెబ్బ కొట్టేందుకు కూడా ఈ ఓటుకు నోటు కేసును మళ్లీ తెర పైకి తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసేంత వరకూ ఇలాంటి వ్యూహత్మక ఎత్తుగడలు మరిన్నీ ఉంటాయని అంటున్నారు.