Begin typing your search above and press return to search.
కేసీయార్ తో పీకే భేటీ లో జరిగింది ఇదేనా?
By: Tupaki Desk | 24 April 2022 6:33 AM GMTరాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కేసీయార్ తో భేటీ అయ్యారా ? శనివారం రాత్రి పీకే ప్రగతి భవనలోనే బస చేశారా ? అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మామూలుగా అయితే వీళ్ళద్దరి సమావేశంలో పెద్దగా విశేషం ఏమీవుండదు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాల్లో మాత్రం ఇద్దరి భేటీ కచ్చితంగా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే పీకే గడచిన వారంరోజుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఐదుసార్లు భేటీ అయ్యారు.
తొందరలోనే పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ అధికారికంగానే ప్రకటించారు. బహుశా పీకే కాంగ్రెస్ లో చేరటం ఈ నెలాఖరులోగా జరుగుతుందనే అనుకుంటున్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత పీకే ఇంకేపార్టీతో కూడా పనిచేసేందుకు లేదని కాంగ్రెస్ సీనియర్లు షరతు విధించారు. ఇలాంటి నేపధ్యంలోనే కేసీయార్-పీకే భేటీ అంటే కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికే టీఆర్ఎస్ తో పనిచేయటానికి గతంలోనే పీకే అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని ప్రకారం పీకే సంస్ధ ఐప్యాక్ రంగంలోకి దిగేసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో విస్తృతంగా సర్వే కూడా చేశారు. ఈ విషయాలపై చర్చించేందుకే ప్రగతిభవన్లో పీకే రాత్రంతా బసచేసినట్లు సమాచారం. ఇప్పటికే 30 నియోజకవర్గాలకు చెందిన సర్వే రిపోర్టుపై కేసీయార్ తో పీకే చర్చించారట. మిగిలిన 89 నియోజకవరగాల్లోని సర్వే రిపోర్టును పీకే అందంచినట్లు తెలుస్తోంది.
ఈ సర్వే రిపోర్టుపై చర్చించేందుకు ప్రగతిభవన్లో పీకే రాత్రంతా ఉండిపోయారట. ఆదివారం కూడా వీళ్ళద్దరే భేటీ అవుతారని అంటున్నారు. అందకనే కేసీయార్ ఎవరికీ అపాయిట్మెంట్లు కడా ఇవ్వలేదట. సోనియాతో భేటీ గురించి, సీనియర్లతో సమావేశాల గురించి, ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ విషయాలను కూడా కేసీయార్ కు పీకే వివరించారు. సోనియాతో సమావేశంలో టీఆర్ఎస్ తో గతంలోనే జరిగిన ఒప్పందాన్ని కూడా వివరించినట్లు కేసీయార్ కు చెప్పారని పార్టీవర్గాలు అంటున్నాయి. మరి పూర్తి సమాచారం బయటకు రావటానికి కొంత కాలం పడుతుంది.