Begin typing your search above and press return to search.

దళితబంధు పేరుతో బండి..మోడీ పేరుతో కేటీఆర్!

By:  Tupaki Desk   |   18 Aug 2021 2:30 PM GMT
దళితబంధు పేరుతో బండి..మోడీ పేరుతో కేటీఆర్!
X
నువ్వా నేనా అన్నట్లుగా తెలివిని ప్రదర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర నేతల తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ మాటలతో ఒకరిని ఒకరు ఇబ్బందులకు గురి చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంలో భాగంగా దళితులకు రూ.10లక్షల చొప్పున బ్యాంకు ఖాతాలో వేయటం తెలిసిందే. ఏదో మాటల్లో కాకుండా ఇప్పటికే కేసీఆర్ తాను దత్తత తీసుకున్న గ్రామంతో పాటు.. తాజాగా త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంపిణీకి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తొలుత ఈ పథకం కోసం రూ.500కోట్లను కేటాయించినట్లు చెప్పిన ఆయన.. తర్వాత ఆ పథకానికి వస్తున్న స్పందనను చూసిన కేసీఆర్..ఇప్పుడీ పథకం ఖాతాకు రూ.2వేల కోట్లు కేటాయించేసి మరోసంచలనానికి తెర తీశారు. వాసాల మర్రిలో మాదిరి హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం పంచేందుకు వీలుగా కసరత్తు జరుగుతోంది. ఇదిలా ఉంటే. దళిత బంధు పథకంతో అంతకంతకూ పెరుగుతున్న ఇమేజ్ కు చెక్ పెట్టేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇప్పుడు కొత్త ఆటకు తెర తీశారు.

బీజేపీ నేతలంతా గ్రామాలకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పిన రూ.10లక్షల మొత్తాన్ని పొందేందుకు వీలుగా అప్లికేషన్లు పెట్టాలని.. దానికి సంబంధించిన ఫిర్యాదుల్ని ప్రత్యేకంగా సేకరించి.. ప్రభుత్వానికి నిద్రలేకుండా చేయాలన్న ఆలోచనలో బండి సంజయ్ ఉన్నారు. అందుకే.. దళితబంధు పథకానికి తమ పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఆయన కొత్త తరహా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున దరఖాస్తుల్ని సేకరించటం ద్వారా.. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయటం మొదలు పెట్టారన్న మాట వినిపిస్తోంది.

బండి చేపట్టిన ప్రోగ్రాంతో కొత్త సమస్యలు తెర మీదకు వస్తాయని గుర్తించిన మంత్రి కేటీఆర్.. ఇప్పుడు ఆయన ప్రజాకోర్టులో కౌంటర్ వేసే కార్యక్రమాన్ని షురూ చేశారని చెప్పాలి. ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ప్రతి ఒక్క పేద కుటుంబానికి రూ.15లక్షల మొత్తాన్ని వారిఖాతాల్లో వేస్తానని గొప్పలు చెప్పుకునే ప్రధాని మోడీ.. ఇప్పుడా పని ఎందుకు చేయట్లేదన్న ప్రశ్నన.. ఈ మధ్యన సందిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు ప్రతి పేదోడి ఖాతాకు రూ.15లక్షల మొత్తాన్ని జమ చేస్తానని మోడీ చెప్పారంటూ మంత్రి కేటీఆర్ ఇప్పుడు సరికొత్త మాటను చెబుతున్నారు.

దళితబంధులో భాగంగా ఇచ్చే రూ.10లక్షల కోసం పెట్టాల్సిన దరఖాస్తును.. ప్రధాని మోడీ ఇస్తానని చెప్పిన రూ.15లక్షల కోసం అప్లికేషన్ ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇవ్వాలంటున్నారు. బండి షురూ చేసిన ఉద్యమాన్ని ఆయనకే చేటు తెచ్చేలా మంత్రి కేటీఆర్ ప్లానింగ్ ఉందని చెప్పక తప్పదు. ఒకరికొకరు ఇచ్చుకోవాలన్న కౌంటర్లు.. ఎవరికి ఇబ్బందికరంగా మారతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.