Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఏపీ ప‌ర్య‌ట‌న రేపే..!

By:  Tupaki Desk   |   27 Jun 2018 10:27 AM GMT
కేసీఆర్ ఏపీ ప‌ర్య‌ట‌న రేపే..!
X
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే తాను మొక్కు చెల్లిస్తానంటూ టీఆర్ ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ చేసుకున్న మొక్కును చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హోదాలో రేపు (గురువారం) బెజ‌వాడ‌కు బ‌య‌లుదేర‌నున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ముక్కుపుడ‌క మొక్కు చెల్లించుకుంటాన‌ని చెప్ప‌టం.. ఇటీవ‌ల కాలంలో ప‌లుమార్లు బెజ‌వాడ వెళ్లే ప్రోగ్రాం పెట్టుకున్న‌ప్ప‌టికీ ఏదో ఒక కార‌ణం చేత ఆగిపోవ‌టం తెలిసిందే.

తాజాగా త‌న మొక్కు చెల్లించుకోవ‌టానికి షెడ్యూల్‌ ను ఖ‌రారు చేసుకున్నారు కేసీఆర్‌. గురువారం మ‌ధ్యాహ్నం 11.30 గంట‌ల‌కు కుటుంబ స‌మేతంగా కేసీఆర్ హైద‌రాబాద్ నుంచి బెజ‌వాడ‌కు వెళ్ల‌నున్నారు. ప్ర‌త్యేక విమానంలో ఆయ‌న ప్ర‌యాణం ఉంటుంద‌ని చెబుత‌న్నారు.

అమ్మ‌వారి ద‌ర్శ‌నం త‌ర్వాత సాయంత్రం హైద‌రాబాద్‌ కు తిరిగి రానున్నారు. కేసీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బెజ‌వాడ‌లో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే ప‌లు దేవాల‌యాల్లో బంగారు కానుక‌లు స‌మ‌ర్పిస్తాన‌ని కేసీఆర్ మొక్కుకోవ‌టం.. ఇందులో భాగంగా గ‌తంలో తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. త‌ర్వాత వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి బంగారు కిరీటం.. కుర‌విలో వీర‌భ‌ద్ర‌స్వామికి బంగారు మీసాలు స‌మ‌ర్పించుకున్నారు. తాజాగా తీర్చుకోనున్న మొక్కుతో కేసీఆర్ పెట్టుకున్న మొక్కుల‌న్నీ తీరిపోనున్న‌ట్లు చెబుతున్నారు. త‌న బెజ‌వాడ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో భేటీ అవుతారా? లేదా? అన్న దానిపై స్ప‌ష్ట‌త రాలేదు.