Begin typing your search above and press return to search.
ఏపీ సర్కారు తాజా నిర్ణయంతో కేసీఆర్ కు కోపమొచ్చింది?
By: Tupaki Desk | 12 May 2020 4:00 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపమొచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుందన్న వాదనను ఆయన వినిపిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసేలా కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలంటూ తీసుకున్న ఏపీ సర్కారు నిర్ణయాన్ని ఆయన తప్పు పడుతున్నారు.
దీనికి సంబంధించిన జీవో ఇప్పటికే విడుదల కావటం.. దీనికి సంబంధించిన సమాచారం తమకు ఇవ్వకుండా ఏపీ సర్కారు అనుసరించిన తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఎత్తిపోతల పథకం గురించి ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర విభజన చట్టాలకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొత్త ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సర్కారు షురూ చేయటం సరికాదని.. దీంతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తింటాయని వ్యాఖ్యానించారు.
ఈ పథకాన్ని అడ్డుకోవటం కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ పథకం గురించి కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టటం ఏపీ స్టేట్ చేస్తున్న తీవ్రమైన తప్పిదమన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు.
మరీ.. ఎత్తిపోతల పథకంపై ఏపీ సర్కారు వాదన ఏమిటన్నది బయటు రావాల్సి ఉంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం చోటు చేసుకోవటం ఇదే తొలిసారి. మరి.. దీనిపై ఏపీ సీఎం స్పందన ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.