Begin typing your search above and press return to search.
కేసీఆర్... చూశావా వీరి బుద్ధి !
By: Tupaki Desk | 2 Dec 2018 5:51 AM GMTకేసీఆర్ మిగతా వాళ్లలాగా మెతక మనిషి కాదు. ఓటర్లు కాబట్టి వారిని ఎపుడూ బుజ్జగించాలనుకునే రకమూ కాదు. బహిరంగ సభే అయినా కోపమొస్తే తిట్టేస్తాడు. ప్రజలకు చేయాల్సిన మంచి చేయాలి కానీ బుజ్జగింపులు ఎందుకు ? మంచిగుంటే మంచిగుంటాం అనే టైపు. అలాంటి మనస్తత్వం ఉన్నోడు కాబట్టే... ఏ రోజూ ఒవైసీలు ముస్లింల తరఫున డిమాండ్ చేయని 12 శాతం రిజర్వేషన్ల గురించి హామీ ఇచ్చారు. ఎపుడైతే కేసీఆర్ ఆ హామీ ఇచ్చారో అమ్మో ముస్లింలలో చీలిక వచ్చినా వస్తుందని...భావించిన ఎంఐఎం టీఆర్ ఎస్ తో జట్టు కట్టేందుకు ఆసక్తి చూపింది. వాళ్లే వస్తామంటే వద్దనడమెందుకులే అని కేసీఆర్ కలుపుకుపోయారు.
అయితే, ఎన్నికలు వచ్చేసరికి వారిలోని బుద్ధి బయటపడింది. నిజానికి ఎంఐఎం ఎప్పటినుంచో పాతబస్తీని తమ ప్రాంతంగా కాకుండా తమ దేశంగా భావిస్తూ వస్తోంది. జాతీయ జెండా ఎగురవేయరు. జనగణమన కూడా పాడరు. కాకపోతే చేసేదేం లేక వారి బుద్ధిని మనసులోనే దాచుకుంటారు. కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చి మిత్రులుగా ప్రకటిస్తే ఇపుడు ఆయనకే ఎర్త్ పెట్టే లా మాట్లాడుతున్నారు తండ్రీకొడుకులు. తండ్రి అసద్ ఏమో గుడ్డి మామ కంటే ఒంటి కన్ను మామ మేలు... అని టీఆర్ ఎస్ కు మద్దతిస్తున్నాం అన్నాడు. తాజాగా ఆయన కొడుకు అక్బర్ మరింత దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
*డిసెంబరు 11 తర్వాత చక్రం తిప్పుతాం.. ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్ చేస్తం. అంతా సవ్యంగా జరిగితే మనమే ముఖ్యమంత్రి అవుదాం..* అన్నాడు. వీళ్లతో కలవడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్లే అని ఒక టీఆర్ ఎస్ నేత వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిందే ఇపుడు పరిస్థితి చూస్తే నిజమే అనిపించకమానదు. నిజానికి ఈరోజు కొత్తగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. గత వారం రోజులుగా పలు దఫాలుగా ఈయన ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 38 స్థానాలు గెలిచిన జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయినప్పుడు 8 స్థానాలు గెలుచుకుంటే తానెందుకు ముఖ్యమంత్రి కాలేనని అక్బర్ వ్యాఖ్యానించారు. అక్బర్ ప్రకటనలపై ఇప్పటిదాకా టీఆర్ ఎస్ పార్టీ అధికారికంగా స్పందించలేదు.