Begin typing your search above and press return to search.
ఖమ్మం ఎపిసోడ్ పై కేసీఆర్ ఎంత కోపమంటే..
By: Tupaki Desk | 30 April 2017 5:32 AM GMTరాజకీయ నేతల్లో చిత్రమైన లక్షణాలు కొన్ని ఉంటాయి. అధికారంలోకి రానంతవరకూ తమంత విశాలమైన హృదయం ఉన్నోళ్లు మరొకరు లేరన్నట్లుగా వ్యవహరిస్తారు. ఒక్కసారి పవర్ కానీ చేతికి వస్తే చెలరేగిపోతారు. తమంత శక్తివంతులు ఈ భూప్రపంచంలో ఉండరన్నట్లుగా వ్యవహరిస్తారు. తమంత తెలివైనోళ్లు లేరన్నట్లుగా కూడా కనిపిస్తుంటారు. పవర్ తీసుకొచ్చిన తెలివి.. బలాన్ని అంచనా వేయటంలో ఏ మాత్రం తేడా కొట్టినా.. కొంప మునిగిపోవటం ఖాయం.
ఓపక్క రైతుల జీవితాల్ని మొత్తంగా మార్చేయటానికి ఎకరానికి రూ.4వేలు ఇవ్వటం ద్వారా రైతుఓటు బ్యాంకు మీద గురి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఖమ్మం జిల్లా రైతుల ఆగ్రహం తెగ చిరాకు తెప్పించేసిందన్న మాట వినిపిస్తోంది. రైతుల బతుకుల్ని మొత్తంగా మార్చేయటానికి తాను ప్లాన్ల మీద ప్లాన్లు వే్స్తుంటే.. ఓపిక పట్టకుండా అలా కస్సుబుస్సు మంటూ సర్కారీ కార్యాలయాల్ని తగలబెట్టేయటం మీద ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఏ రైతులతో తెలంగాణలో తానో తిరుగులేని శక్తిగా మారాలని అనుకున్నారో.. అదే రైతులతో ఆగమాగం అయిపోయిన తీరు ఆయన్ను తీవ్రంగా బాధకు గురి చేసినట్లు కనిపిస్తోంది. ఇందుకే కాబోలు.. ఖమ్మంలో మిర్చి రైతుల ఆగ్రహం ఎపిసోడ్ ను కేసీఆర్ తనదైన శైలిలో చెబుతున్నారు.
ఖమ్మం మిర్చి రైతులు నిరసన.. ప్రభుత్వ కార్యాలయాన్ని విధ్వంసం చేయటంలో రైతుల పాత్ర అస్సలు లేదని.. అదంతా కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఖమ్మం ఎపిసోడ్ మొత్తం రాజకీయ ఉద్దేశాలతోనే దాడి చేశారే తప్పించి.. జరిగిన విధ్వంసం రైతులు చేసింది కాదని తేల్చి చెప్పారు. కొందరు మీడియాను ముందు పంపి తర్వాత విధ్వంసం సృష్టించినట్లుగా తేల్చటమే కాదు.. ఈ ఉదంతంతో సంబంధం ఉన్న వారు ఎంతటోళ్లు అయినా వదిలిపెట్టేది లేదని.. వారిపై కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకుంటామని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఒకరోజు అసెంబ్లీ సమావేశం కోసం ఏర్పాటు చేసిన బీఏసీలో రైతు సమస్యలపై సభలో చర్చించాలన్న మాట కాంగ్రెస్ నేతల నోటి నుంచి రావటం ఆలస్యం.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా రియాక్ట్ కావటం.. ఖమ్మం ఘటన అంతా కుట్ర పూరితమని తేల్చేయటం.. అక్కడ చేసిందంతా రైతులు కాదు.. రాజకీయపార్టీల వారంటూ ఫైర్ అయినట్లుగా చెబుతున్నారు.
బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి అంత సీరియస్ గా ఉండటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాటి రాజకీయ నేతలపై ముఖ్యమంత్రి అంత తీవ్రంగా వ్యవహరించరని.. కేసీఆర్ అలా చేశారంటే.. ఆయనెంత ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఖమ్మంలో జరిగిన దాడి రైతులు చేసింది కాదని.. అదంతా రాజకీయంగా తేల్చేసిన కేసీఆర్.. ఇందుకు బాధ్యులైన వారిని వదిలిపెట్టమని చెప్పేసిన తీరు చూస్తే.. ఖమ్మం మిర్చి ఘాటు కేసీఆర్ ను ఎంతగా కమ్మేసిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఖమ్మం మిర్చి మంటకు తగ్గట్లే కేసీఆర్ కోపం ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. తనకు తిరుగులేదని అనుకుంటున్న వేళ.. ఖమ్మం మిర్చి రైతుల ఆగ్రహం ఆయనకు భారీ షాక్ ఇచ్చిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/