Begin typing your search above and press return to search.

మతలబ్ క్యా : కొడుకుపై గులాబీ బాస్.. గుస్సా!!

By:  Tupaki Desk   |   2 March 2018 3:30 PM GMT
మతలబ్ క్యా : కొడుకుపై గులాబీ బాస్.. గుస్సా!!
X
ముఖ్యమంత్రి కేసీఆర్ గుస్సా అయ్యారు. అయినా కేసీఆర్ గుస్సా కాకపోతే వార్త గానీ.. అయితే వార్తేంది? దీన్ని చెప్పుడెందుకు అని మీరు గూడా గుస్సా గాకండి. ఇందులో చిన్న మతలబున్నాది ఈ సారి ఆయన ఏ ఆఫీసర్ల మీదనో - ఎమ్మెల్యేల మీదనో.. కాంగ్రెసోళ్లు - తెలుగుదేసమోళ్ల మీదనో గుస్సా గాలే. తన కొడుకు కేటీఆర్ మీదనే గుస్సా అయిండు. అందుకే అది వార్తయింది.

అదెందుకో తెలుసుకోవాలంటే.. రెండు రోజుల వెనక్కెళ్లాలి...

రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి చోటా చాలా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చారు. రైతుల ఆదాయం పెంచేందుకు తెరాస సర్కారు ఎంత కట్టుబడి ఉన్నదో చెప్పారు. పనిలో పనిగా.. రైతులకు మద్దతిచ్చే విషయంలో కేంద్రం స్పందించడం లేదంటూ.. మోడీ మీద విరుచుకుపడ్డారు. మోడీ గురించి ఏకవచనంలో సంబోధిస్తూ.. నీ అయ్య ముల్లెపోతదా అని కామెంట్ చేస్తూ.. చెలరేగిపోయారు.

రైతుల సదస్సు.. రైతులకు మద్దతుగానే మాట్లాడడం గనుక.. సహజంగానే ఆయన మాటలకు హర్షధ్వానాలు దక్కాయి. కానీ.. భాజపా మాత్రం.. ఈ వివాదాన్ని పట్టుకుని విమర్శలకు దిగింది.

ఈ నేపథ్యంలో టాటా వారి బోయింగ్ విమానాల ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కేటీఆర్ ఆహ్వానించారు. అయితే.. ఆమె కేసీఆర్ - మోడీని తిట్టిన తిట్లను ప్రస్తావించి.. తనకు కార్యక్రమానికి రావాలని లేదన్నారట. దాంతో కేటీఆర్ పొరబాటుగా అలా మాట్లాడేశారని సర్ది చెప్పి.. ఆమెను కార్యక్రమానికి తీసుకెళ్లారు. అయితే ఇలా కేటీఆర్ సారీ చెప్పడం తండ్రికి గుస్సా తెప్పించింది.

‘‘తాను మాట్లాడిన మాటలు పొరబాటు మాట్లాడానని కేటీఆర్ ఎలా అంటాడు? ఇది తన ఇజ్జత్ కు సంబంధించిన సంగతి కదా. తను సోయిలో ఉండే మాట్లాడిన. దాన్ని తప్పంటడా.. మీటింగుకు ఆమె రాకుంటె ఏమైతది.. అందుకని మన ఇజ్జత్ దీస్కుంటమ. మనమేమైన బాంచన్ కాల్మొక్త లెక్క బత్కుతున్నమా..’’ అంటూ గులాబీ బాస్ ఫైర్ అవుతున్నారన్నమాట. కుటుంబంలో వివాదమే గనుక.. చప్పున చల్లారిపోతుందని.. ఇదేమాట మరొకరు చెప్పిఉంటే కేసీఆర్ మరింత సీరియస్ అయ్యేవారని అంతా అనుకుంటున్నారు.