Begin typing your search above and press return to search.
ఢిల్లీలో వంగే వంగుడికి భిన్నంగా కేంద్రంపై కేసీఆర్ కు కోపమొచ్చింది
By: Tupaki Desk | 8 Oct 2021 5:12 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు తెలిసిందే. ఆయనకు ప్రేమ వస్తే ఆకాశానికి ఎత్తేయటం.. ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ఆయనకు అలవాటే. తాజాగా అలాంటి ఆగ్రహాన్నే మరోసారి ప్రదర్శించారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు.. ప్రధాని మోడీని కలిసినప్పుడు ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు.. ఆయన బాడీ లాంగ్వేజ్ కు పూర్తి భిన్నంగా తెలంగాణ అసెంబ్లీలో చెలరేగిపోయారు. ప్రధానమంత్రి స్థానాన్ని.. కేంద్రానికి ఉండే ఔనిత్యం గురించి మనసుకు నచ్చినప్పుడు కితాబులు ఇచ్చే ఆయన.. అందుకు భిన్నంగా ఫైర్ అయ్యారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో పల్లె.. పట్టణ ప్రగతిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఏమన్నారు? ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్లో కీలకం ఏమిటన్న విషయాన్ని చూస్తే..
- కేంద్రం తీరు దారుణం. ప్రాంతీయ పార్టీ నేతగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యతిరేకిస్తున్నా. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తోంది. ఉమ్మడిగా ఉండే శాఖలనూ తమ అధీనంలోకి తీసుకుంటోంది. వ్యవసాయాన్ని కూడా తీసుకోవటం ఏమిటి? రోజు రోజుకూ హక్కుల్ని లాగేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాల్ని బతకనివ్వటం లేదు.
- ఉపాధి హామీ కూలీల డబ్బును కూడా ఢిల్లీ నుంచి వేస్తారా? ఇక రాష్ట్రాలు ఎందుకు? సర్పంచ్ లు ఎందుకు? రాష్ట్రాల హక్కులపై కేంద్రంపై పోరాడతా. రాష్ట్రాల హక్కుల్ని హరించటంతో నాడు కాంగ్రెస్..నేడు బీజేపీ ఒకే దారిలో నడుస్తున్నాయి.
- జీఎస్టీ తీసుకొచ్చారు. పెట్రోల్.. డీజిల్ ను జీఎస్టీలోకి తెస్తామని చెబితే అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎక్కువ నిధులు వెళుతున్నాయి. అక్కడి నుంచి మాత్రం ఆ మేరకు రావటం లేదు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రావాల్సిందే. కేంద్రం నుంచి వస్తున్నది కేవలం కేంద్ర ప్రాయోజిత పథకాలు మాత్రమే . గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పంచాయతీలు, ఇతర ఆస్తులను కుదవపెట్టాలని కేంద్రం చెబుతోంది.
- ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్‌సీఐ విధానం సరిగా లేదు. కేంద్రం వైఖరి మార్చుకోవాలి. ఫ్‌సీఐ నుంచి స్పష్టత వచ్చాక, రాష్ట్రంలో ఏ పంటలు వేయాలో నవంబరు మొదటి వారంలో రైతులకు సూచిస్తాం. రైతు బంధు నిధులు, ధాన్యం కొనుగోలు డబ్బు సకాలంలో ఇవ్వడంతో రాష్ట్రంలో రైతులు అప్పులు చేయకుండా ఉంటున్నారు.
- కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చే నిధులంటూ ఉండవు. దేశాన్ని నడిపే క్రమంలో రాజ్యాంగం ప్రకారం కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది. ఇందులో భారత ఆర్థిక సంఘం ఒకటి. రాష్ట్రాలకు చేసేవి ఆర్థిక సంఘం కేటాయింపులే తప్ప కేంద్రం కేటాయింపులు కావు.
- కేంద్రం వసూలు చేసే పన్నుల నుంచి క్రమానుగతంగా, ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తుంది. కేంద్రానిది పోస్ట్‌మ్యాన్ వ్యవహారం తప్ప కేంద్రం నిధులంటూ ఉండవు. కేంద్రం నుంచి మాత్రమే నిధులు వస్తున్నాయి.. ఇస్తున్నాయనేది సరికాదు. కేంద్రం ఏదో ఇస్తున్నట్లు.. రాష్ట్రాలేదో చిప్ప పట్టుకొని అడుక్కుంటున్నట్లు ఆ భావమే సరికాదు. పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆర్థిక సంఘం కేటాయింపులు ఇవి. అన్ని రాష్ట్రాలకు ఆటోమేటిక్‌గా వస్తాయి.