Begin typing your search above and press return to search.

మంత్రి పదవులు.. వీరికి షాక్ గ్యారెంటీ..

By:  Tupaki Desk   |   29 Dec 2018 3:46 AM GMT
మంత్రి పదవులు.. వీరికి షాక్ గ్యారెంటీ..
X
ఢిల్లీలో పార్టీ ఎంపీలతో సమాలోచనలు జరిపిన కేసీఆర్ దాదాపు తెలంగాణ మంత్రివర్గాన్ని ఖాయం చేసుకున్నారట.. గడిచిన ఎన్నికల్లో కేసీఆర్ టార్గెట్ 100 సీట్లు. ఆ 100 సీట్లు రాకుండా కొందరు చేశారని.. ముఖ్యంగా ఖమ్మం లాంటి జిల్లాలో పార్టీ ఓడిపోవడానికి ఇద్దరి నేతల మధ్య పొరపొచ్చాలే కారణమని విశ్లేషించారు. ఆ ఇద్దరికి పడక పార్టీని గాలికి వదిలేశారని.. ఆ ఎఫ్టెక్టే జిల్లాలో పార్టీ ఓటమికి కారణమని విశ్లేషించారు. దీంతో ఆ ఇద్దరిపై కేసీఆర్ కఠినంగా ఉంటారని స్పష్టమైంది.

ఇంతకీ ఖమ్మం జిల్లాలో టీఆర్ ఎస్ ను దెబ్బతీసిన ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే వారే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు - ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. వీరిద్దరి ఆధిపత్యం - కుమ్ములాటల వల్లే టీఆర్ ఎస్ ఓడిపోయిందని కేసీఆర్ ఢిల్లీలో పార్టీ నేతలతో వ్యాఖ్యానించారట.. పార్టీలో పనిచేసిన వారికే పదవులని.. పార్టీకి నష్టం చేకూర్చిన వారికి పదవులు ఇవ్వనని చెప్పుకొచ్చాడట. దీన్ని బట్టి ఖమ్మం కోటాలో మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్న పొంగులేటి - తుమ్మల బ్యాచ్ కు నిరాశ ఎదురైనట్టే.. ఈ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇస్తారనేది ఆసక్తిగా మారింది.

కేసీఆర్ కు ఇప్పుడు అసమ్మతి భయం లేదు.. 90 మంది మెజార్టీ ఉంది. దీంతో పాలన - పార్టీ ప్రక్షాళనకు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా మంత్రి పదవులు - వివిధ చైర్మన్ల ఎంపికలో షాకిస్తానని తెలిపాడట.. పార్టీకి నష్టం చేసిన చైర్మన్లను తొలగిస్తానని చెప్పుకొచ్చాడట..

ఇక వివిధ జిల్లాలన్నింటిలోనూ బేరిజు వేసిన కేసీఆర్ గడిచిన సారి మంత్రులుగా చేసిన సగం మందికి ఈసారి మంత్రి పదువులు ఇచ్చేలా కనిపించడం లేదు. కొత్త వారికి పార్టీ కోసం కష్టపడ్డ వారికి మంత్రి పదవులు ఇస్తానని చెప్పుకొచ్చాడు.

ఇక కేసీఆర్ రాష్ట్రానికి రావడంతో ఆదివారం - లేదా సోమవారం మంత్రి వర్గ విస్తరణకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తిగా మారింది.