Begin typing your search above and press return to search.
ధర్మంగా ఉన్న కేసీఆర్ తాజా వరం
By: Tupaki Desk | 24 July 2015 9:52 AM GMTఎందుకిస్తున్నారో కూడా తెలీకుండా వరాలు ఇవ్వటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటే. కానీ.. ఆయన అందుకు భిన్నంగా.. వరం ఇవ్వటానికి నూటికి రెండు వందల శాతం అర్హత ఉన్న వారికి తాజాగా ప్రకటించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి వచ్చిన గోదావరి పుష్కరాల సందర్భంగా పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా కష్టపడిన పుష్కర ఉద్యోగులందరికి ఊహించని వరం ఇచ్చి అందరి మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. ఈ నెల 14న మొదలైన గోదావరిపుష్కరాలు ఈ నెల 25 వరకు జరగనున్నాయి. అంటే.. శనివారంతో పుష్కరాలు ముగియనున్నాయి. ఆదివారం ఎటూ సెలవే.
అయితే.. ఈ నెల 26.. 27 తేదీలు.. పుష్కరాల్లో డ్యూటీ చేసిన ఉద్యోగులకు రెండు రోజుల సెలవు ప్రకటించారు. గడిచిన పదకొండు రోజులుగా గోదావరి పుష్కరాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తగా విధులు నిర్వహించిన ఉద్యోగులకు కేసీఆర్ ప్రకటించిన తాజా వరం ధర్మంగా ఉందనే చెప్పాలి. మరి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేసీఆర్ బాటలో నడుస్తారో లేదా? లేక.. అంతకు మించి అంటూ మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్నది చూడాలి.