Begin typing your search above and press return to search.

వాన‌ల్లేని తెలంగాణ‌లో కేసీఆర్ వ‌రాల వ‌ర్షం

By:  Tupaki Desk   |   28 Aug 2018 11:39 AM GMT
వాన‌ల్లేని తెలంగాణ‌లో కేసీఆర్ వ‌రాల వ‌ర్షం
X
ముంద‌స్తుకు వెళ్లాల‌ని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాల మూట‌ను విప్ప‌తీయ‌నున్నారు. ఊహించ‌ని రీతిలో వీలైనంత మందికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా వ‌రాల వ‌ర్షాన్ని కురిపించ‌నున్నారు. త‌న వ‌రాల జ‌ల్లుల్లో త‌డిచి ముద్దైపోవ‌ట‌మే కాదు.. రాష్ట్ర ప్ర‌జ‌ల్ని స‌మ్మోహితుల్ని చేయ‌ట‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో ముంద‌స్తుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ.. తానేం సాధించాల‌న్న ఉద్దేశంతో హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరారో.. దేశ రాజ‌ధానిలో తాను అనుకున్న‌వి అనుకున్న‌ట్లుగా పూర్తి చేస్తున్న వేళ‌.. కేబినేట్ అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

మోస్ట్ ఇమ్మీడియ‌ట్ అంటూ జారీ చేసిన ఈ స‌ర్క్యుల‌ర్ ముంద‌స్తు కోస‌మేన‌న్న మాట వినిపిస్తోంది. ముంద‌స్తు సంకేతాల‌కు ముందే ప‌లు కులాలు.. సామాజిక భ‌వ‌నాల‌కు ప్ర‌భుత్వం స్థ‌లాలు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. వివిద కులాల‌కు భ‌వ‌నాలు.. నిధుల వ‌రాన్ని ఇచ్చిన కేసీఆర్.. భూముల కేటాయింపు మాత్రం చేయ‌లేదు. తాజాగా.. యుద్ధ ప్రాతిప‌దిక‌న స్థ‌లాల కేటాయింపు చేస్తున్నారు.

అంతేకాదు.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మ‌ధ్యంత‌ర భృతిపై కేబినెట్ నిర్ణ‌యం తీసుకోనుంది. ఐఆర్ నుసైతం ఇప్ప‌డే డిసైడ్ చేసి అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత ఏర్ప‌డే ప్ర‌భుత్వం ద్వారా గ‌తానికి భిన్నంగా మెరైగ‌న ఫిట్ మెంట్ ఇవ్వ‌నున్న‌మాన్న సంకేతాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌భుత్వంపై గుర్రుగా ఉన్న‌ర‌న్న ప్ర‌చారం సాగుతున్న నిరుద్యోగ భృతి పైనా నిర్ణ‌యం తీసుకునే వీలుంద‌ని చెబుతున్నారు. నిరుద్యోగ భృతి కింద త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే రూ.3వేల చొప్పున ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కాంగ్రెస్ కంటే ర‌వ్వంత ఎక్క‌వుగానే నిరుద్యోగ భృతిపై ప్ర‌క‌ట‌న ఉంద‌ని చెబుతున్నారు. దీని ద్వారా దాదాపు 10 ల‌క్ష‌ల మంది వ‌ర‌కూ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని భావిస్తున్నారు.

అదే స‌మ‌యంలో వృద్దాప్య‌.. వితంతు.. విక‌లాంగుల ఫించ‌న్లు కూడా పెంచే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌గ‌తి నివేద‌న స‌ద‌స్సుకు ముందు ఎన్ని కేబినెట్ స‌మావేశాలు జ‌రుగుతాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్ణ‌యాలు చ‌క‌చ‌కా తీసుకోవాల్సి ఉన్నందున‌.. అసెంబ్లీ ర‌ద్దుకు ముందు క‌నీసం రెండుసార్లు కేబినెట్ భేటీలు ఉంటాయ‌ని భావిస్తున్నారు.

ప్ర‌భుత్వం తీసుకోవాల్సిన నిర్ణ‌యాల్ని ఒకేసారి కాకుండా.. ఎప్పుడు తీసుకున్న నిర్ణ‌యాల్ని అప్పుడు ప్ర‌క‌టించేందుకు వీలుగా సెప్టెంబ‌రు 2 లోపు రెండుసార్లు భేటీ కావాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ స‌ర్కారు ఉన్న‌ట్లు తెలుస్తోంది. స‌భ ముందు నాటికే వ‌రాల‌కు సంబంధించిన అధికారిక నిర్ణ‌యాలు తీసుకొని.. స‌భ‌లో ఘ‌నంగా ప్ర‌క‌టించుకోవాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తెలంగాణ‌లో వ‌ర్షాలు అంతంత‌మాత్రంగా కురిసిన వేళ‌.. ముంద‌స్తు పుణ్య‌మా అని కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చే వ‌రాల‌తో తెలంగాణ ప్ర‌జ‌లు త‌డిచి ముద్దైపోవ‌టం ఖాయ‌మంటున్నారు.