Begin typing your search above and press return to search.
రంజాన్ తోఫా ప్రకటించేశారు
By: Tupaki Desk | 3 July 2015 4:46 AM GMTఎప్పుడు ఎవరికి ఏం అవసరమన్న విషయాన్ని వారికంటే కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు గుర్తించేస్తారు. అవసరం కంటే కూడా పొలిటికల్ మైలేజీ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయని ఆయన.. తాజాగా మైనార్టీల మనసుల్ని దోచుకునేందుకు రంజాన్ తోఫా ప్రకటించేశారు.
చాలీచాలని జీతాలతో కిందామీదా పడుతున్న తెలంగాణ ఆర్చక స్వాములకు జీతాలు పెంపు విషయంలో ఎన్నో వినతులు చేసినా పట్టని విసయం తెలిసిందే. చివరకు వారు విధులు బహిష్కరించే వరకూ వెళితే కానీ.. వారి డిమాండ్లు సాధించుకోలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అర్చక స్వాములు ఉంటే.. దీనికి భిన్నంగా ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించిన చందంగా మసీదుల్లోని ఇమామ్‌లు.. మౌజమ్‌లకు రూ.వెయ్యి చొప్పున జీవన భృతి ఇవ్వనున్నట్లు తాజాగా వెల్లడించారు.
మైనార్టీలకు వరాలు ఇవ్వటం తప్పు కాదు. కానీ.. అదే సమయంలో న్యాయబద్ధమైన డిమాండ్ల విషయంలోనూ ఇంతే ఉదారంగా వ్యవహరించాలి కదా అన్నదే పాయింట్. తాజాగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మైనార్టీలకు భారీగా తాయిలాల్ని కేసీఆర్ ప్రకటించారు. రూ.26కోట్లతో సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
కేసీఆర్ సాబ్ వరాలజల్లులేమిటంటే..
- తెలంగాణ రాష్ట్రంలోని 1.95లక్షల పేద ముస్లింలకు దుస్తుల పంపిణీ.
- ఐదు వేల మసీదుల్లోని ఇమామ్‌లు.. మౌజమ్‌లకు నెలకు రూ.వెయ్యి చొప్పున జీవనభృతి.
- జూలై 8న నిజాం కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు.
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో.. అన్ని మసీదులు.. అనాథ శరణాలయాల వద్ద ఇఫ్తార్ విందులు.