Begin typing your search above and press return to search.
మహమ్మారి పై కేసీఆర్ మరో సంచలన ప్రకటన
By: Tupaki Desk | 28 May 2020 4:15 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మహమ్మారి గురించి అభయమిచ్చారు. సడలింపులు ఉన్నప్పటికీ మహమ్మారి వ్యాప్తి ఆందోళనకరంగా భయంకరమైన స్థాయిలో లేదని ప్రజలకు భరోసానిచ్చారు. ప్రజలు భయపడవద్దని.. స్వీయనియంత్రణ, జాగ్రత్తలు పాటిస్తేచాలని స్పష్టం చేశారు. రాబోయే మూడు నెలలూ దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతాయని తెలిపారు. ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు కేసీఆర్ మాట్లాడారు.
తెలంగాణలో ఎన్ని కేసులకు అయినా చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అవసరమైన పీపీఈ కిట్లు, టెస్ట్ కిట్లు, మాస్క్ లు, పడకలు, వెంటిలేటర్లు, ఆస్పత్రులు అన్నీ సిద్ధంగా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు చూస్తే మహమ్మారి గురించి భయపడకూడదని అర్తమవుతోందని కేసీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాలు - ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనాల ప్రకారం వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ, లక్షణాలు చాలా మందిలో కనిపించడం లేదని.. వైరస్ ఉన్నవారిలో 80 శాతం మందికి లక్షణాలు లేవని.. ఈ వ్యాధిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 15 శాతం మందికి మాత్రమే ఇన్ఫ్లుఎంజా లాంటి లక్షణాలు, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని వారు అభిప్రాయపడ్డారు. వారికి మాత్రమే మహమ్మారి సోకుతోందని..డేంజర్ గా ఉందని తెలిపారు. వీరు కూడా వేగంగా కోలుకుంటున్నారని.. 5 శాతం మందికి మాత్రమే తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ అనారోగ్యం ఉందని.. ఈ రోగుల గురించి మరింత జాగ్రత్త తీసుకోవాలని అధికారులకు సూచించారు.
దేశంలో మరణాల రేటు 2.86 శాతంగా ఉంటే., తెలంగాణ రాష్ట్రంలో ఇది 2.82 శాతంగా ఉందని... ఈ రోగులకు ఇతర షుగర్, బీపీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా చనిపోయారని కేసీఆర్ తెలిపారు.సడలింపుల తర్వాత ప్రజలు రోడ్ల మీదకొచ్చినా పెద్దగా వైరస్ వ్యాప్తించడం లేదని దీంతో భయాపడాల్సిన అవసరం లేదని తెలిపారు.