Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట నిజం కాలేదుగా?

By:  Tupaki Desk   |   25 Aug 2018 4:51 AM GMT
కేసీఆర్ మాట నిజం కాలేదుగా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్వ‌హించే మీడియా భేటీలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. విలేక‌రుల స‌మావేశంలో తాను చెప్పాల్సిందంతా చెప్పేసిన త‌ర్వాత కేసీఆర్ త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చే క్వ‌శ్చ‌న్ అవ‌ర్ మీడియా భేటీకి హైలెట్ గా నిలుస్తుంటుంది. త‌న‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న‌లు వేసే ఒక‌రిద్ద‌రు మీడియా మిత్రుల‌కు పంచ్ వేయ‌టం.. ఆ పంచ్ ల్లో ఎట‌కారాన్ని సంధించ‌టం.. తోటి మీడియా మిత్రులు న‌వ్వేసేలా చేసి.. ప్ర‌శ్న వేసిన పాత్రికేయుడి ముఖం మాడిపోయేలా చేయ‌టం కేసీఆర్ కు అల‌వాటు.

ఇటీవ‌ల నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఒక పాత్రికేయుడు వేసిన ప్ర‌శ్న‌కు.. అసెంబ్లీ ర‌ద్దు విష‌యాన్ని ఎవ‌రైనా చెబుతారా అయ్యా? మ‌ంత్రుల‌కు కూడా తెలీదంటూ ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీని ర‌ద్దు చేసే ఆలోచ‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి ఎవ‌రూ తన నిర్ణ‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌ర‌ని.. చేత‌ల‌తో చేసి చూపిస్తార‌ని చెప్పారు.

మ‌రి.. కేసీఆర్ మాట‌లు నిజ‌మ‌య్యాయా? అంటే లేద‌ని చెప్పాలి. ముంద‌స్తుపై ఆయ‌న అంచనాలు ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాలో వ‌స్తున్నాయి. పేరుకు అంచ‌నాలే అయినా అవే నిజ‌మ‌య్యాయి. చివ‌ర‌కు అసెంబ్లీ ర‌ద్దుకు సంబంధించిన విశ్లేష‌ణ కూడా తాజాగా వ‌చ్చింది. లాజిక్ కు స‌రిపోతున్న ఈ విశ్లేష‌ణ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

కేబినెట్ మంత్రుల‌కు కూడా అసెంబ్లీ ర‌ద్దు మాట చెప్ప‌రంటూ కామెడీ చేసిన కేసీఆర్‌.. అందుకు భిన్నంగా ఆయ‌న అసెంబ్లీని ఎప్పుడు ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని ఆయ‌న న‌మ్మే జాత‌కాలు.. జ్యోతిష్యం ఆధారంగానే చెబుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్త‌క‌రంగా మారింద‌ని చెప్పాలి. మిగిలిన ముచ్చ‌ట్లు ఎలా ఉన్నా.. అసెంబ్లీ ర‌ద్దుపై కేసీఆర్ చేసిన కామెంట్ మాత్రం వ‌ర్క్ వుట్ కాన‌ట్లేన‌న్న మాట తాజా ప‌రిణామాలు చెబుతున్న‌ట్లు ప‌లువురి నోట వినిపిస్తోంది.