Begin typing your search above and press return to search.

కేసీఆర్ జాతకానుసారం.. కోర్టులో చెల్లదు కదా.?

By:  Tupaki Desk   |   9 Oct 2018 9:18 AM GMT
కేసీఆర్ జాతకానుసారం.. కోర్టులో చెల్లదు కదా.?
X
తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వింత వాదనకు అందరూ నోరెళ్లబెడుతున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ఇలా కూడా ఉంటాయా అని ప్రతిపక్షాలు ఏకి పారేస్తున్నాయి. అసెంబ్లీని రద్దు ఎందుకు చేశారంటే.. నెపం ప్రతిపక్షాల మీద పెడుతున్నారు. తాజాగా హైకోర్టులో కూడా ఇదే వాదన వినిపిస్తున్నారట.. కానీ అసెంబ్లీ రద్దుపై అసలు నిజం వేరే ఉంది.. ఏంటా నిజం..?

అసెంబ్లీని 9 నెలల ముందుగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. అలా ఎందుకు చేశారంటే.. ప్రభుత్వంపై కేసులు వేస్తున్నారు.. కోర్టుకు వెళ్తున్నారు.. అందుకే రద్దు చేయాల్సి వచ్చిందని మీడియా సమావేశంలో చెప్పారు. ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం ఎవరూ చేయకపోతే - కోర్టుకు వెళ్లి తేల్చుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని సామాన్యులెవ్వరినీ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకోనీయకపోవడంతో వారంతా చేసేది లేక కోర్టుకు వెళ్లి వాదన వినిపిస్తున్నారు.. అంత మాత్రానికే ఎవరైనా నొచ్చుకొని ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న.

అసెంబ్లీలో, సభల్లో తనదైన శైలిలో ఏకిపారేసి కేసీఆర్ కేవలం ప్రతిపక్షాలు కోర్టుకెళ్లాయని ప్రభుత్వాన్ని రద్దు చేసుకునేంత అమయాకుడేం కాదు.. ప్రతిపక్షాల విమర్శలకు జవాబు చెప్పకుండా సిల్లీగా ఇలా చేస్తారనుకోవడం పొరపాటే.. మీరు అడిగితే మేం చెప్పాలా అనే ఆయన .. మా ప్రభుత్వం మా ఇష్టం రద్దు చేస్తామని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు హైకోర్టు సాక్షిగా నిరూపితమైంది.

కేసులు వేయగానే కాళేశ్వరం ప్రాజెక్టు ఆగిందా?, మిషన్ భగీరథ నిలిచిపోయిందా?, మిషన్ కాకతీయకు బ్రేక్ పడిందా?, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏ పథకమైనా కేసుల వల్ల ఆగాయా అంటే లేదనే సమాధానం ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి వస్తోంది. కోర్టులో కేసు వేయగానే ప్రభుత్వ లాయర్లు ఉన్నారు కదా!. పిటీషన్లలో పస ఉంటేనే కోర్టు స్వీకరిస్తుంది లేదంటే, పిటీషన్ వేసిన వారినే చీవాట్లు పెడుతుంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై ప్రభుత్వం తరపున వాదించే లాయర్లు.. ప్రతిపక్షాలు కోర్టుకు వెళుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని.. కేసులతో పాలన సాగడం లేదని.. అందుకే ప్రతిపక్షాలు - అధికార పక్షం ఎవరిది కరెక్టో తేల్చుదామనే టీఆర్ ఎస్ అసెంబ్లీ రద్దు చేసినట్టు వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారట..

అయితే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన కారణం మాత్రం అది కాదు.. 2018లోపే ఎన్నికలు జరిగితే కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని.. ఆయన జాతకం ప్రకారం.. 2019 లో ఎన్నికలు జరిగితే నష్టమేనన్నటు ఉందని సమాచాారం. అందుకే జ్యోతిష్యులు చెప్పిన ప్రకారమే ఆయన తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇదే విషయాన్ని హైకోర్టులో చెబితే చీవాట్లతోపాటు కేసు వీగిపోతుంది. అందుకే ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని వాదన వినిపిస్తున్నారు. మరి త్వరలో జరగబోయే విచారణలో కేసీఆర్ వాదన నెగ్గుతుందా.? ప్రతిపక్షాల పంతం నెరవేరుతుందా అనేది వేచిచూడాలి.