Begin typing your search above and press return to search.

ఢిల్లీకి వెళ్ళి ఏమి చేశారు ?

By:  Tupaki Desk   |   30 July 2022 3:30 PM GMT
ఢిల్లీకి వెళ్ళి ఏమి చేశారు ?
X
కేసీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ఐదు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు. ఐదురోజుల పాటు ఢిల్లీలో కేసీయార్ ఏమిచేశారంటే ఏమి చేశారో ఎవరికీ తెలీదు. ఢిల్లీలో ల్యాండ్ ఆయన దగ్గర నుండి గెస్ట్ హౌస్ నుండి ఒక్క అడుగు కూడా బయటపెట్టలేదట. నాలుగు రోజులు కేసీయార్ ను కలవటానికి గెస్ట్ హౌస్ కు ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదట.

శుక్రవారం మధ్యాహ్నం మాత్రం ఎస్పీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గెస్ట్ హౌస్ లో కేసీయార్ తో సమావేశమయ్యారు. అఖిలేష్ తో ఏమి మాట్లాడారన్నది బయటకు తెలిసే అవకాశంలేదు.

అయినా అఖిలేష్ తో ఇప్పటికే కేసీయార్ చాలాసార్లే భేటీఅయ్యారు. ఇంతకీ కేసీయార్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు ? అఖిలేష్ ను తప్ప ఇంకెవరినీ కలవకుండా ఎందుకు తిరిగివచ్చేసినట్లు ? అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే కేసీయార్ ఎక్కడకు వెళ్ళినా ముఖ్యమంత్రి హోదాలోనే వెళతారు. సీఎం హోదాలో వెళ్ళటమంటే ఖర్చుమొత్తం ప్రభుత్వమే భరించాలి. ఢిల్లీలో ఐదురోజుల ట్రిప్పంటే భారీగానే ఖర్చవుతుంది.

ఢిల్లీకి వెళ్ళి ఏమీ చేయనపుడు, ఎవరినీ కలవనపుడు ప్రభుత్వం మీద ఎందుకింత ఖర్చుల భారం వేసినట్లు ? నరేంద్రమోడీకి వ్యతిరేకంగా జాతీయస్ధాయిలో ఏదో చేసేద్దామన్నది కేసీయార్ ఆలోచన. అయితే అందుకు పరిస్ధితులు అనుకూలంగా ఉన్నాయా ? తనతో చేతులుకలిపే వారున్నారా ? అనేది చాలా ముఖ్యం.

ఇక్కడ గమనించాల్సిందేమంటే కేసీయార్ కు జాతీయస్ధాయిలో పెద్దగా క్రెడిబులిటీ లేదు. కేసీయార్ ఎప్పుడు ఎలాగుంటారో ఎవరికీ తెలీదు కాబట్టి సీఎంతో కలిసి నడిచేందుకు ఎవరు సానుకూలంగా లేరు. ఈ విషయం గతంలోనే నిరూపణైంది. జాతీయపార్టీ కాంగ్రెస్ తో పడక, మిగిలిన ప్రాంతీయపార్టీలూ నమ్మక ఇక జాతీయ రాజకీయాల్లో ఏమి సాదిద్దామని కేసీయార్ అనుకుంటున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు.