Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఆఫీసుకు వచ్చినా వార్తేనా?
By: Tupaki Desk | 14 Nov 2015 9:45 AM GMTఒక ముఖ్యమంత్రి తన కార్యాలయానికి రావటం కూడా వార్తేనా? అని ప్రశ్నిస్తే కచ్ఛితంగా కాదని ఎవరైనా చెబుతారు. కానీ.. తనదైన ప్రత్యేకతతో వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో మాత్రం ఇది కాస్త మినహాయింపుగా చెప్పాలి. ఎందుకుంటే.. ఆయన కొద్ది వారాలుగా సచివాలయానికి రావటం లేదు.
తాజాగా ఆయన సెక్రటేరియట్ కు రావటం పలువురు ఆసక్తిగా మాట్లాడుకున్న పరిస్థితి. ఒక దినపత్రికలో అయితే.. విశేషంగా కేసీఆర్ సీఎంవోకు వచ్చారంటూ వార్తను అచ్చేశారు కూడా. కేసీఆర్ తన కార్యాలయానికి వెళ్లటం వార్త ఏ మాత్రం కానప్పటికీ.. ఆయన గడిచిన నెలన్నర కాలంలో సీఎంవోకు రాకపోవటమే కారణంగా చెబుతున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఉమ్మడి రాష్ట్రంలోని సెక్రటేరియన్ ను రెండు ముక్కలుగా చేసి.. రెండు తెలుగు రాష్ట్రాలకు భవనాల్ని పంచటంతో పాటు.. మధ్యలో ఇనుప కంచె కూడా వేశారు. ఇక.. ఇద్దరు ముఖ్యమంత్రులతో సచివాలయంతో సందడిగా మారుతుందని భావించారు. అయితే అందుకు భిన్న పరిస్థితి నెలకొంది. ఓటుకు నోట ఇష్యూ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి హైదరాబాద్ వదిలేసి.. విజయవాడకు వెళ్లటం.. అక్కడి సీఎంవో కార్యాలయం నుంచి తన కార్యకలాపాల్ని నిర్వహించటం చేస్తున్నారు.
వాస్తవానికి వారానికి కొద్దిరోజులు విజయవాడలో.. మరికొన్ని రోజులు హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తానని చెప్పినప్పటికీ.. ఆయన విజయవాడకే పరిమితమైపోయారు. చాలా అరుదుగా మాత్రమే హైదరాబాద్ వస్తున్నారు. ఒకవేళ హైదరాబాద్ వచ్చినా ఇంటికి వెళ్లి.. తిరిగి వెళ్లిపోతున్నారే తప్పించి సెక్రటేరియట్ కు రాని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారం మరోలా ఉంది. ఆయనకున్న సెంటిమెంట్ల ఫుణ్యమా అని ఆయన సచివాలయం రావటం మానేశారన్న మాట ఉంది. సచివాలయం వాస్తు విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ఆయన సెక్రటేరియట్ కు రాకుండా క్యాంప్ ఆపీసు నుంచే తన కార్యకలాపాలు పూర్తి చేస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో శుక్రవారం ఆయన సెక్రటేరియట్ కు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ అంశం వార్తగా మారింది కూడా.
మొత్తానికి ఇద్దరు ముఖ్యమంత్రులతో సచివాలయం కళకళలాడుతుందని అందరూ భావిస్తే.. అందుకు భిన్నంగా వేర్వేరు కారణాలతో ఇద్దరు ముఖ్యమంత్రులు సచివాలయానికి రాకపోవటంతో.. సెక్రటేరియట్ చిన్నబోతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.