Begin typing your search above and press return to search.
రోశయ్య-కేసీఆర్ లు దేని గురించి మాట్లాడుకున్నారు!
By: Tupaki Desk | 14 Aug 2016 12:53 PM GMTతమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య మనవడి వివాహం ఆదివారం నాడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలను పలువురు రాజకీయ ప్రముఖులతోపాటు వివిధ రంగాలకు చెందిన వారు కూడా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలకు హాజరైన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ - ఏపీ విపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి - నిజామాబాద్ ఎంపీ కవిత - కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ - తమిళనాడు గవర్నర్ రోశయ్యలు కలిసి మాట్లాడుకున్నారు!
ఈ వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ కూడా ఈ ఇద్దరి భేటీ. రోశయ్య - కేసీఆర్ లు చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు! ఇంతకీ ఆ ఇద్దరూ ఏ అంశం గురించి మాట్లాడుకుని ఉంటారా అనేది వచ్చిన అతిథిలు ఆసక్తికరంగా చూశారు. నిజానికి, ఈ మధ్యనే కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు రోశయ్య. హరితహారం కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీరు చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా మార్చేందుకు కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. అంతేకాదు, ఇటీవల కరీనంగర్‌లో పర్యటించిన రోశయ్య మొక్కలను కూడా నాటారు.
సో.. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తరువాత, ఇప్పుడు ఒకే వేదిక మీద ఈ ఇద్దరు ప్రముఖులూ కలవడం ఆసక్తికరంగా మారింది. పైగా, ఈ ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకోవడం... ఇంకా ఆసక్తికరం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... త్వరలోనే తమిళనాడు గవర్నర్ పదవి నుంచి రోశయ్యను భాజపా సర్కారు మార్చే అవకాశాలున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కర్ణాటకకు చెందిన ఒక ప్రముఖుడిని తమిళనాడు గవర్నర్ గా పంపించే ప్రయత్నాలు కేంద్రం చేస్తోందని కూడా తెలుస్తోంది.