Begin typing your search above and press return to search.
కుటుంబాన్ని దూరం పెట్టిన కేసీఆర్
By: Tupaki Desk | 8 Aug 2016 6:05 AM GMTఅందరిలాంటి అధినేత కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన చేసే పని ఏదీ తప్పు అన్నట్లుగా అనిపించకుండా తాను చేయాలనుకున్నది చేసేయటం ఆయనకు అలవాటు. కొడుకు.. కూతురు లాంటి ప్రత్యేక అభిమానాలు ఉన్నట్లుగా ఏనాడు వ్యవహరించని ఆయన.. వారి చుట్టూనే మొత్తం వ్యవహారం తిరిగేలా చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. తానేం కోరుకున్నానో.. అదే జరిగేటట్లుగా ప్లాన్ చేయటంలో కేసీఆర్ కు మించిన మొనగాడు నేత తెలుగు నేత మీద లేరనే చెప్పాలి. మిగిలిన వారికి భిన్నంగా తన ఫ్యామిలీ మెంబర్లను సిస్టంలో భాగస్వామ్యం చేయటమే కాదు.. అదంతా తన ప్రోత్సాహంతో అయినట్లు కాకుండా.. వారి ప్రతిభతో సదరు స్థానాల్లోకి చేరుకున్నట్లుగా కనిపించేలా చేయటంలో కేసీఆర్ చాతుర్యమంతా కనిపిస్తుంది.
తాజాగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఇలాంటి తీరునే ప్రదర్శించారు కేసీఆర్. సహజంగా ప్రధాని లాంటి పెద్దమనిషి రాష్ట్రానికి వస్తుంటే.. మంత్రిగా వ్యవహరిస్తున్న తన కొడుకును.. ఎంపీగా తరచూ పార్లమెంటులో వివిధ అంశాల మీద తన వాణిని వినిపించే కుమార్తెను పరిచయటం చేయటం లేదంటే.. అందరూ కలిసి స్వాగతం పలకటం లాంటివి చేస్తుంటారు. కానీ.. అలా చేస్తే.. కార్యక్రమం మొత్తం కేసీఆర్ ఫ్యామిలీనే కమ్మేసినట్లుగా ఉంటుందన్న ఉద్దేశంతో వారిని దరిదాపుల్లోకి రానివ్వకుండా చేయటం కేసీఆర్ కు మాత్రమే చెల్లింది.
ఎయిర్ పోర్ట్ దగ్గరకే కాదు.. కోమటిబండలో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరైన కుమారుడు కేటీఆర్ ను వేదిక మీదకు రాకుండా ఆయన తీసుకున్న జాగ్రత్త చూస్తే.. కేసీఆర్ కు ఎంత ముందుచూపో అర్థమవుతుంది. వేదిక దగ్గర మందితో పాటు.. మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ అక్కడే ఉండిపోయారే తప్పించి.. వేదిక మీద కనిపించేందుకు ఏ మాత్రం ఆసక్తి కనబర్చలేదు. ఇక.. కేసీఆర్ కుమార్తె కవిత ఎక్కడా కనిపించింది లేదు. ఎంత కొడుకైనా.. కూతురైనా.. రాజకీయం రాజకీయమే. వ్యక్తిగత అనుబంధాలు వ్యక్తిగతమన్నట్లుగా కేసీఆర్ తీరు ఉండటం ఆసక్తికరంగా చెప్పాలి.
ఇక్కడే ఇంకో విషయాన్ని ప్రస్తావించాలి. ఈ మధ్యన కొన్ని కార్యక్రమాల్లోనూ.. ముఖ్యుల దగ్గరకు వెళ్లేటప్పుడు తన ముద్దుల మనమడ్ని (కేటీఆర్ కుమారుడు) తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు కేసీఆర్. ఆ మధ్యన హైదరాబాద్ కు రాష్ట్రపతి వచ్చిన సందర్భంగా తన మనమడ్ని ప్రణబ్ దాకు కేసీఆర్ ప్రత్యేకంగా పరిచయం చేయటం తెలిసిందే. కానీ.. మోడీ పర్యటనలో మాత్రం అందకు భిన్నంగా.. ఎక్కడా కుటుంబ సభ్యులను తెర మీద కనిపించకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఇదంతా.. మోడీ మైండ్ సెట్ కు తగ్గట్లే కేసీఆర్ వ్యవహరించారన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వారసత్వ రాజకీయాల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారంటూ తెలంగాణ బీజేపీ నేతలు తరచూ విమర్శలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వారి వాదనల్లో నిజం లేదన్న విషయానని ప్రధాని మోడీకి చెప్పకనే చెప్పినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రధాని తెలంగాణ పర్యటన సందర్భంగా తన ఫ్యామిలీ మెంబర్లను ఏ మాత్రం ఫోకస్ కాకుండా వ్యవహరించటంలో కేసీఆర్ తనదైన మార్క్ ను ప్రదర్శించారనే చెప్పాలి.