Begin typing your search above and press return to search.

హ‌రీశ్ కు కొబ్బ‌రికాయ కొట్టే ఛాన్స్ ఇవ్వ‌ని కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   19 Jun 2019 4:43 AM GMT
హ‌రీశ్ కు కొబ్బ‌రికాయ కొట్టే ఛాన్స్ ఇవ్వ‌ని కేసీఆర్‌!
X
ఇవాల్టి రోజున గొప్ప‌గా చెప్పుకుంటున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం వెనుక రెక్క‌ల క‌ష్టం ఎవ‌రిద‌న్న ప్ర‌శ్న వేస్తే.. హ‌రీశ్ రావు అన్న మాట వినిపిస్తుంటుంది. 24 గంట‌ల పాటు.. షిఫ్ట్ ల వారీగా ప‌నులు చేయించి.. ఎక్క‌డా ఎలాంటి లోటు రాకుండా చేయ‌ట‌మే కాదు.. నాణ్య‌త విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డ‌కుండా..ఉరుకులు ప‌రుగులు పెట్టించి ప్రాజెక్టును ఆల‌స్యం కాకుండా పూర్తి చేయ‌టంలో నూటికి నూరు శాతం క్రెడిట్ హ‌రీశ్ కే ద‌క్కుతుంది.

డబ్బులిచ్చేది కేసీఆర్ అయితే అవ్వొచ్చు.. ఆ డ‌బ్బుల్ని స‌క్ర‌మంగా స‌ద్వినియోగం చేసే స‌త్తా కూడా ఉండాలిగా. ఆ విష‌యంలో హ‌రీశ్ స‌మ‌ర్థ‌త కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. అలాంటి ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేసి.. ప్రాజెక్ట్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన వేళ‌.. దాన్ని టేక‌ప్ చేసిన కేసీఆర్ హ‌రీశ్ మాట వినిపించ‌కుండా చేయ‌టంలో స‌క్సెస్ అయ్యారు.

ఎవ‌రి లెక్క‌లు వారివ‌న్న‌ట్లుగా.. కాళేశ్వ‌రం క్రెడిట్ హ‌రీశ్ ఖాతాలో పెరిగితే..త‌న రాజ‌కీయ వార‌సుడికి పోటీగా మారే ప్ర‌మాదంతో పాటు.. చ‌రిత్ర‌లో హ‌రీశ్ పేరు అలా నిలిచిపోతుంద‌న్న ఆలోచ‌న లాంటి వాటితో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశార‌న్న మాట కొంద‌రి నోట వినిపిస్తూ ఉంటుంది. అందులో నిజం ఎంత‌? అబ‌ద్ధం ఎంత‌? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. అలాంటి వాద‌న‌కు బ‌లం చేకూరేలా కేసీఆర్ తీరు ఉండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హ‌రీశ్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా ఉండ‌టానికి కార‌ణాల్లో కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఒక‌ట‌న్న విష‌యాన్ని కొంద‌రు చెబుతుంటారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ శాఖామంత్రిగా హ‌రీశ్ పేరు ప్ర‌ఖ్యాతులు భారీగా పెరిగిపోతాయ‌న్న ఉద్దేశంతో వ్యూహాత్మ‌కంగా ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశార‌న్న ఆరోప‌ణ కేసీఆర్ మీద ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఎలాంటి బాధ్య‌త హ‌రీశ్ కు అప్ప‌జెప్ప‌కుండా ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. ఈ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌యం చేసే ప‌నిని ఈటెల రాజేంద‌ర్ కు అప్ప‌జెప్పిన తీరు చూస్తే.. హ‌రీశ్‌ కు జ‌రుగుతున్న అన్యాయం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇంతేనా.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభం సంద‌ర్భంగా కేసీఆర్ మేడిగ్డ‌..క‌న్నెప‌ల్లి పంప్ హౌస్ వ‌ద్ద కొబ్బ‌రికాయ కొట్టి పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఇదే ప్రాజెక్టు కింద సుందిళ్ల‌.. అన్నారం బ్యారేజ్ తో పాటు.. మూడు పంపింగ్ స్టేష‌న్ల వ‌ద్ద కొబ్బ‌రికాయ‌లు కొట్టే కార్య‌క్ర‌మం ఒక‌టి ఉంది. ఈ ఐదుచోట్ల కూడా మంత్రుల‌కే కొబ్బ‌రికాయ‌లు కొట్టే అవ‌కాశం ఇచ్చారు కేసీఆర్‌.

ఇంత పెద్ద ప్రాజెక్టు కోసం ఏళ్ల‌కు ఏళ్లు రెక్క‌లు ముక్క‌లు చేసుకున్న హ‌రీశ్ కు.. ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా క‌నీసం కొబ్బ‌రికాయ కొట్టే అవ‌కాశం ఇవ్వ‌ని తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఒక విష‌యంలో డిసైడ్ అయ్యాక కేసీఆర్ ఎంత క‌ఠినంగా ఉంటార‌న్న విష‌యం తాజా ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు.