Begin typing your search above and press return to search.

గ‌మ‌నించారా?: గ‌వ‌ర్న‌ర్‌..కేసీఆర్ భేటీలు త‌గ్గాయ్!

By:  Tupaki Desk   |   23 Oct 2018 5:11 AM GMT
గ‌మ‌నించారా?: గ‌వ‌ర్న‌ర్‌..కేసీఆర్ భేటీలు త‌గ్గాయ్!
X
దేశంలో మ‌రే రాష్ట్రంలో క‌నిపించ‌ని ఒక సీన్.. తెలంగాణ‌లో మాత్రం ప‌దే ప‌దే ఆవిష్కృత‌మ‌య్యేది. ఏ గ‌వ‌ర్న‌ర్ తో కూడా మ‌రే ముఖ్య‌మంత్రి లేనంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించ‌టం తెలంగాణ అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కే ద‌క్కేది. ముఖ్య‌మంత్రి హోదాలో ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయిన‌న్ని ద‌ఫాలు.. మూడు..నాలుగు సార్లు ముఖ్య‌మంత్రులుగా ప‌ని చేసిన నేత కూడా చేసి ఉండ‌రు.

ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చున్న నాలుగున్న‌రేళ్ల కాలంలో స‌చివాల‌యానికి కంటే నాలుగైదింత‌లు రాజ్ భ‌వ‌న్ కే కేసీఆర్ ఎక్కువ‌గా వెళ్లి ఉంటార‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. దీనికి త‌గ్గ‌ట్లే.. త‌ర‌చూ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో భేటీ అయ్యే ఆయ‌న‌.. రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌థ‌కాలు.. తీసుకున్న నిర్ణ‌యాల గురించి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లుగా చెప్పేవారు.

ఇందుకు సంబంధించిన ప్రెస్ రిలీజ్ లు త‌ర‌చూ మీడియా కార్యాల‌యాల‌కు వ‌చ్చేవ‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. గ‌వ‌ర్న‌ర్ సాబ్ తో భేటీల జోరు.. అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌న్న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌టానికి ఆర్నెల్ల ముందు నుంచి మ‌రింత పెరిగిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం ఏమంటే..అసెంబ్లీ ర‌ద్దు అనంత‌రం.. గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయ్యింది పెద్ద‌గా లేద‌నే చెప్పాలి. మామూలుగా అయితే.. ఇప్పుడు గ‌డిచిన వ్య‌వ‌ధిలో మూడు..నాలుగుసార్లు అయినా భేటీ అయ్యేవారు. కానీ.. అందుకు భిన్నంగా గ‌వ‌ర్న‌ర్ తో భేటీల‌కు ఫుల్ స్టాప్ పెట్టారా? అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి హోదాలో గ‌వ‌ర్న‌ర్ సాబ్ తో భేటీ కాకూడ‌ద‌ని అనుకున్నారా? అన్న‌ది తేలాల్సి ఉంది.