Begin typing your search above and press return to search.

కవిత ఓటమి ఎంత పనిచేసింది..

By:  Tupaki Desk   |   3 July 2019 6:15 AM GMT
కవిత ఓటమి ఎంత పనిచేసింది..
X
ఒక్క ఓటమి.. ఒకే ఒక్క ఓటమితో చాలా మంది రాజకీయ జీవితాలు తలకిందులయ్యాయి. దిగ్గజ నేతలను కేసీఆర్ స్వయంగా ఆహ్వానించి అందలమెక్కించారు. ఇప్పుడు ఆ ఓటమితో వారి రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడిపోయింది.

మండవ వెంకటేశ్వరరావు.. తెలంగాణ టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరు..ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మండవ - కేసీఆర్ లు టీడీపీలో కలిసి పనిచేశారు. మంత్రివర్గంలో ఇద్దరూ మంత్రులుగా చేశారు. అంతటి సాన్నిహిత్యం ఉన్న మండవ తెలంగాణ ఏర్పడ్డాక మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికెళ్లి పార్టీలో చేర్చుకున్నారు.

ఇక మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. మంచి వక్త. తెలివితేటలు పుష్కలంగా ఉన్న ఈయన కూడా కాంగ్రెస్ లో సీనియర్ నేత. ఈయనను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు..

వీరిద్దరూ నిజామాబాద్ కు చెందిన సీనియర్ నేతలు. పలుకుబడి - క్యాడర్ ఉన్న వారు. వీరిద్దరికి కేసీఆర్ మంత్రి పదవి లేదా రాజ్యసభ పదవులు ఇస్తారని.. అత్యున్నత హోదాలిస్తారని ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ వీరిని పక్కనపెట్టేశారు. వాళ్లు గట్టిగా అడగలేని పరిస్థితి ఏర్పడింది. దీనికంతటికి ఒకటే కారణం.. కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడమే.. కవితను గెలిపించేందుకు వీరిద్దరినీ లాగేసిన కేసీఆర్ ఆ కవిత ఓటమితో ఇప్పుడు నిజామాబాద్ వైపే చూడడం లేదట. ఇక టీఆర్ ఎస్ అధినేత కూతురునే గెలిపించకపోయినందుకు మండవ - సురేష్ రెడ్డి కూడా కేసీఆర్ ను గట్టిగా అడగడం లేదట.. ఇలా కవిత ఓటమితో ఇద్దరు ఉద్దండుల రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది.