Begin typing your search above and press return to search.

చండీయాగంలో ఏ రోజు ఏం జరుగుతుంది?

By:  Tupaki Desk   |   19 Dec 2015 6:56 AM GMT
చండీయాగంలో ఏ రోజు ఏం జరుగుతుంది?
X
మరో రెండు రోజులు మాత్రమే మిగిలాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగం ప్రారంభం కానుంది. ఏడు రోజులపాటు సాగే ఈ యాగంలో ఏ రోజు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం. రోజుకు 50వేల మంది వరకూ భోజనాలు చేసే ఈ యాగానికి.. లక్షలాది మంది ప్రజలు హాజరు అవుతారని భావిస్తున్నారు. యాగం చివరి రోజున (డిసెంబర్ 27న) ప్రముఖులంతా హాజరు కానున్నారు. రోజు వారీగా ఏ రోజు ఏం జరుగుతుందో చూస్తే..

మొదటిరోజు(డిసెంబరు 21)

గురు ప్రార్థన.. గణపతి పూజ.. పుణ్యాహవచనం.. దేవనాంది.. ఆంకురారోహణ.. పంచగవ్య మేళనం.. ప్రాశనము.. గోపూజ.. యోగశాలా ప్రవేశము.. యాగశాలా సంస్కారము.. అఖండ దీపారాధన.. మహా సంకల్పం.. సహస్ర మోదక మహాగణపతి హోమం.. మహా మంగళహారతి.. ప్రార్థన.. ప్రసాదాల పంపిణీ

సాయంత్రం; వాస్తు రాక్షోఘ్నహోమం.. అఘోరాస్త్రహోమం

రెండో రోజు (డిసెంబరు 22)

గురు ప్రార్థన.. గణపతి పూజ.. గోపూజ.. ఉదక శాంతి.. ఆచార్యాది రుత్త్విగ్వరణము.. త్రైలోక్య మోహన గౌరీ హోమం.. మహా మంగళహారతి.. మంత్ర పుష్పం.. తీర్థ ప్రసాదాల పంపిణి

సాయంత్రం; రుత్త్విగ్వరణం.. దుర్గాదీప నమస్కార పూజ.. రక్షా సుదర్శన హోమం

మూడో రోజు (డిసెంబరు 23)

గురు ప్రార్థన.. గణపతి పూజ.. గోపూజ.. మహా మంటప స్థాపనం.. చండీ యంత్రలేఖనం.. యంత్ర ప్రతిష్ఠ.. నవావరణార్చన.. ఏకాదశ న్యాస పూర్వక సహస్ర చండీ పారాయణం.. పంచబలి.. యోగినీబలి.. మహా రుద్రయాగ సంకల్పం.. రాజశ్యామల.. మహారుద్ర.. పునశ్చరణ చతుర్వేద యోగ ప్రారంభం.. మహాసారం.. ఉక్త దేవతా జపం.. మంత్ర పుష్పం.. విశేష నమస్కారాలు.. కుమారి.. సుహాసినీ.. దంపతీ పూ.. మహా మంగళహారతి.. ప్రసాదాల పంపిణీ

సాయంత్రం; కోటి నవాక్షరీ పునశ్చరణం.. విశేషపూజా అశ్లేషాబలి.. అష్టావధాన సేవ

నాలుగో రోజు (డిసెంబరు 24)

గురు ప్రార్థన.. గోపూజ.. ఏకాదశ న్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణమం.. నవావరణ పూజ.. యోగినీ బలి.. మహాధన్వంతరీ యాగం.. రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పునశ్చరణలు.. మహాసారము.. ఉక్త దేవతా జపం.. కుమారి.. సుహాసినీ.. దంపతీ పూజ.. మహా మంగళహారతి.. విశేష నమస్కారములు.. ప్రసాదాల పంపిణీ

సాయంత్రం; కోటి నవాక్షరీ పునశ్చరణ.. ఉపచార పూజ.. విశేష నమస్కారాలు.. శ్రీచక్ర మండలారాధనం.. అష్టావధాన సేవ.. ప్రసాదాల పంపిణీ

ఐదో రోజు (డిసెంబరు 25)

గురు ప్రార్థన.. గణపతి పూజ.. ఏకాదశ న్యాస పూర్వక త్రిసహస్ర చండీపారాయణాలు.. నవావరణ పూజ.. నవగ్రహ హోమం.. యోగినీబలి.. రాజ శ్యామల చతుర్వేద మహారుద్ర పునశ్చరణలు.. మహాసారమే.. ఉక్తదేవతా జపం.. కుమారి.. సుహాసినీ.. దంపతీపూజ... మహా మంగళహారతి.. విశేష నమస్కారాలు.. ప్రసాద పంపిణీ.

సాయంత్రం; కోటి సవాక్షరీ జపం.. పార్థివలింగ పూజ.. అష్టావదాన సేవ.. మహా మంగళహారతి.. విశేష నమస్కారాలు.. తీర్థ ప్రసాదాలు

ఆరో రోజు (డిసెంబరు 26)

గురు ప్రార్థన.. గణపతి పూజ.. ఏకాదశ న్యాస పూర్వక చతుస్సహస్ర చండీపారాయణం.. నవావరణ పూజ.. సప్తద్రవ్య మృత్యుంజయ హోమం.. కుమారి.. సుహాసినీ.. దంపతీ పూజ.. మహా మంగళహారతి.. విశేష నమస్కారాలు.. ప్రసాదాల పంపిణీ

సాయంత్రం ; కోటి సవాక్షరీ జపం.. అష్టావధాన సేవ.. మహా మంగళహారతి.. విశేష నమస్కారాలు.. ప్రసాదాల పంపిణీ

ఏడో రోజు (డిసెంబరు 27)

గురు ప్రార్థన.. గణపతి పూజ.. పుణ్యాహవచనం.. కుండ నమసకకారం.. ప్రధాన కుండంలో అగ్నిప్రతిష్ఠ.. అగ్ని విహరణం.. స్థాపిత దేవతా హవనం.. సపరివార అయుత చండీయాగం.. అయుత లక్ష నవాక్షరీ అజ్యాహుతి.. మహాపూర్ణాహుతి.. వసోర్థారా.. రుత్విక్ సన్మానం.. కలశ విసర్జనం.. అవభృధ స్నానం.. మహాదాశీర్వాచనం.. ప్రసాద పంపిణీ.. యాగ సంపూర్ణం

మూడో రోజు నుంచి ధార్మిక ప్రవచనాలు.. హరికథా కాలక్షేపం.