Begin typing your search above and press return to search.
బాబుకు వరుసగా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ లు
By: Tupaki Desk | 7 March 2019 10:17 AM GMTఅన్నట్టే కేసీఆర్ మాట నిలబెట్టుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీని షేక్ చేసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ గిఫ్ట్ ఎలా ఉంటుంది.? కేసీఆర్ ఏం చేస్తారనే దానిపై చర్చోపచర్చలు సాగాయి.
తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడానికి ముందుగా కేసీఆర్ వరుసగా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ లు ఇస్తూ బాబుకు నిద్రలేకుండా చేస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీడీపీ నిర్వహిస్తున్న సేవా మిత్ర యాప్ దుర్వినియోగం అయ్యిందని.. ఏపీ ప్రజల డేటాను ఐటి గ్రిడ్స్ అనే ఐటీ సంస్థ దొంగిలించిందని ప్రతిపక్ష వైసీపీ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏకంగా సిట్ ఏర్పాటు చేసి దీనిపై టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. ఇందులో చంద్రబాబు సహా టీడీపీ నేతల ప్రమేయంపై నిజాలు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమై ఉంది..
ఆ వివాదం ఇంకా కొనసాగుతుండగానే.. ఇప్పుడు స్తబ్ధుగా ఉన్న ఓటుకు నోటు కేసులో చంద్రబాబును మరోసారి ఇరుకునపెట్టేందుకు కేసీఆర్ రెడీ అయ్యారని తెలుస్తోంది. తాజాగా 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారం.. చంద్రబాబు సంభాషణల మరో వీడియో లీక్ అయ్యింది. సాక్షి టీవీలో ప్రసారమైన ఈ వీడియోల్లో రేవంత్ - సెబాస్టియన్ - ఎమ్మెల్యే స్టీపెన్ సన్ తో సాగించిన బేరాసారాలు కనిపిస్తున్నాయి. దాదాపు 11 నిమిషాలు ఉన్న ఈ కొత్త వీడియో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ వీడియోలో సెబాస్టియన్ చంద్రబాబు పేరు ను ప్రస్తావించి మీకు న్యాయం చేస్తాడని డైరెక్ట్ గా అన్నట్టు ఉంది. ఈ వీడియో ఈరోజు లీక్ కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఇరకాటంలో పడ్డారు.
ఇలా వరుసగా తెలంగాణ కేంద్రంగా బాబుకు వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతుండడం చంద్రబాబును ఉలికిపాటుకు గురిచేస్తోంది. 2019 ఎన్నికల ముందర రాజకీయంగా టీడీపీ ప్రతిష్టను ఇవీ దిగజారుస్తున్నాయి.. ఈ పరిణామాలను ప్రతిపక్ష వైసీపీ ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటుందనేది వేచి చూడాలి. మొత్తానికి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ల పరంపర టీడీపీ అధినేత చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.