Begin typing your search above and press return to search.
బడ్జెట్ సమావేశాలకు ముందు కేసీఆర్ ‘అసాధారణ’ వైఖరి?
By: Tupaki Desk | 8 March 2022 4:47 AM GMTఅవునా? ఇది నిజమా? ఊరుకో బాస్.. జోక్ చేస్తున్నావ్ అంటే.. నాకేం పని.. సీఎం సాబ్ మీద జోకులు వేస్తామా? అంటూ సమాధానం. ఈ తరహా సంభాషణ గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదేమో? సంబంధం లేని మాటలు అర్థం కావట్లేదా? వివరంగా చెబితే.. విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంతకూ జరిగిందేమంటే.. కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గ సమావేశం అన్నంతనే ఆరేడు గంటల పాటు సుదీర్ఘంగా సాగటం తెలిసిందే.
షురూ కావటం మొదలు ఎప్పుడు పూర్తి అవుతుందన్నది డిసైడ్ చేసేది కేసీఆరే. ఎజెండాలోని అంశాల మీద చర్చ జరగటానికే ఇంతసేపు పట్టిందని చెప్పినా.. వాస్తవం ఏమిటన్నది మంత్రివర్గ భేటీలో హాజరయ్యే వారందరికి తెలుసని చెబుతారు.
ఎజెండాలో పెట్టిన అంశాలన్ని చర్చించరని చెప్పట్లేదు కానీ.. కొన్నింటి విషయాల మీద గంటల కొద్దీ ముఖ్యమంత్రి ప్రసంగం సాగుతుందని.. వినసొంపుగా ఉండే మాటలతో మంత్రులు తన్మయత్వం చెందుతారని చెబుతారు.
ఈ కారణంగానే చాలా సందర్భాల్లో మధ్యాహ్నం వేళలో మొదలయ్య మంత్రివర్గ భేటీ.. సాయంత్రం దాటి.. రాత్రి కాస్తా అర్థరాత్రికి దగ్గరకు చేరుకున్న తర్వాత సమావేశం ముగిసినట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత.. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకోవటం చాలామంది తెలంగాణ మంత్రులకు అనుభవమే.
అలాంటిది ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ భేటీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి.
బడ్జెట్ సమావేశాలకు ముందు.. మంత్రివర్గ భేటీ కావటం.. బడ్జెట్ ను ఆమోదించటం లాంటి సాంకేతిక అంశాల కోసం కాబినెట్ భేటీ జరుగుతుంది. ఎప్పటిలానే గంటల కొద్దీ భేటీ ఉంటుందని మానసికంగా సిద్ధమైన మంత్రులు.. అధికారులు సీఎం కేసీఆర్ తీరుకు షాక్ తిన్నారు. ఎందుకంటే.. ఈ మంత్రివర్గ భేటీ రికార్డు స్థాయిలో కేవలం అరగంటలోపే పూర్తి చేయటం.. కాబినెట్ భేటీ పూర్తి అయిపోయిందన్న మాటతో.. తాము విన్నది నిజమేనా? అన్న విస్మయం వ్యక్తమైనట్లు చెబుతున్నారు. కొందరు మంత్రులైతే.. తమ పక్కనున్న సహచర మంత్రుల చేతుల్ని గిల్లి.. ఇది.. నిజమేనా? అంటూ మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది.
ఏమైనా.. కేసీఆర్ తీరు అసాధారణంగా ఉందని.. తాజా భేటీ వేళ.. పెద్దగా మాట్లాడని ఆయన.. ముక్తసరి సంభాషణతో సమావేశాన్ని ముగించారని చెబుతున్నారు. ఇంతకూ ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ కు ఏమైంది? ఆయన మూడ్ బాగోలేదా? లేదంటే.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే విషయంలో ఆయన మదిలో పెద్ద ఎత్తున ఆలోచనలు సాగుతున్నాయా? అన్న ప్రశ్నలు పలువురి నోట వినిపించటం గమనార్హం. ఏమైనా.. ఇలా అరగంటలో కాబినెట్ భేటీ పూర్తి కావటాన్నిమంత్రులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు.