Begin typing your search above and press return to search.
కేటీఆర్ ట్వీట్ వెనుక కేసీఆర్.. క్లాస్ పడ్డాకే పోస్టు పెట్టారా?
By: Tupaki Desk | 30 April 2022 5:49 AM GMTఉన్న ప్రత్యర్థులు సరిపోనట్లు కొత్త రాజకీయ శత్రువుల్ని తెచ్చుకోవటానికి మించిన బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. అందునా.. సమయం.. సందర్భం చూసుకొని.. గురి చూసి వదిలిన బాణంలా మాటలు ఉండాలే తప్పించి.. ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేని వ్యాఖ్యలతో లాభం కంటే నష్టం ఎక్కువ. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కు తెలీదనే చెప్పాలి.
ఈ కారణంతోనే.. అకారణంగా ఏపీ ముచ్చటను తెర మీదకు తీసుకొచ్చి.. మూడు ముక్కల్లో జగన్ సర్కారు తీరు ఇలా ఉంది భయ్.. అంటూ చెప్పేసిన మాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జగన్ వ్యతిరేకులు పండుగ చేసుకునేలా చేస్తే.. ఆయన్ను అభిమానించే వారికి మాత్రం ఒళ్లు మండేలా చేశాయి.
మొత్తంగా అవసరం లేని రాజకీయ రచ్చ మంత్రి కేటీఆర్ మాటలతో మొదలైందని చెప్పాలి. సాధారణంగా తన నోటి నుంచి వచ్చే మాట విషయంలో కింద పడ్డా తనదే పైచేయి అనిపించుకునే అలవాటున్న మంత్రి కేటీఆర్.. తాజా ఎపిసోడ్ లో మాత్రం ఒకింత తగ్గటమే కాదు.. ఏపీలోని జగన్ సర్కారు తమకు స్నేహపూర్వక ప్రభుత్వం అన్న విషయాన్ని చెప్పేస్తూ.. శుక్రవారం అర్థరాత్రి వేళ పోస్టు చేసిన ట్వీట్ వెనుక ఏం జరిగి ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
తమ గొప్పతనం కోసం సోదర ఏపీ రాష్ట్రాన్ని నాలుగు మాటలు అనేయటం కేసీఆర్ కు అలవాటే. కానీ.. ఆయన నోటి నుంచి వచ్చే మాట వెనుక లెక్కలు వేరుగా ఉంటాయి. అంతా ఆలోచించి.. ఒక నిర్ణయానికి వచ్చి.. తన వ్యూహంలో భాగంగా కేసీఆర్ మాటలు ఉంటాయి. అందుకు భిన్నంగా అదాటున కేటీఆర్ నోటి నుంచి తాజా వ్యాఖ్యలు వచ్చాయంటున్నారు. తెలంగాణ గొప్పతనం.. రాష్ట్రంలో జరిగిన డెవలప్ మెంట్ గురించి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తే.. అది కాస్తా మిస్ ఫైర్ కావటం.. రచ్చ రచ్చ అవ్వటం తెలిసిందే.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గుస్సా అయినట్లు చెబుతున్నారు. అవసరం లేని కంపను నెత్తిన వేసుకోవటం ఏమిటంటూ గులాబీ బాస్ గుస్సాతో.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయక తప్పలేదంటున్నారు.
ఇప్పుడు ఉన్న సమీకరణాలు మొత్తం కేటీఆర్ మాటలతో మారాయన్న విషయాన్ని తండ్రి ఆగ్రహంతో అర్థం చేసుకున్న కేటీఆర్.. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా పొద్దుపోయిన తర్వాత ట్వీట్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. డ్యామేజ్ కంట్రోల్ కావటానికి ఉద్దేశించిన ట్వీట్ దగ్గర దగ్గర అర్థరాత్రి వేళ ఎందుకు చేసినట్లు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం దొరికేదెప్పుడో?