Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డికి చెక్ చెప్పే కేసీఆర్ భారీ ప్లాన్

By:  Tupaki Desk   |   31 Aug 2021 5:39 AM GMT
రేవంత్ రెడ్డికి చెక్ చెప్పే కేసీఆర్ భారీ ప్లాన్
X
తెలంగాణలో కేసీఆర్ కు ధీటైన ప్రత్యర్థిగా నిలబడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ కు కొరకరరాని కొయ్యగా మారాడు. విమర్శలు.. ప్రతి విమర్శలతో సై అంటే సై అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్న కేసీఆర్ టార్గెట్ గానే ముందుకెళుతున్నాడు. అందుకే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఇప్పుడు టీఆర్ఎస్ రాజకీయం మొదలుపెట్టింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయనను ఓడించేందుకు భారీ కసరత్తే జరిగింది. రేవంత్ రెడ్డికి కంచుకోటలా ఉండే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనను స్వల్ప తేడాతో ఓడించారు. రేవంత్ ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా కేసీఆర్ చేసిన ప్లాన్ వర్కవుట్ అయ్యింది. రేవంత్ ను ఓడించడంలో కేసీఆర్ సఫలమయ్యారు.

అయితే ఈసారి తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక ఆయన మరింత బలోపేతం అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. ధీటైన నేతగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఎలాగైనా సరే రేవంత్ ను ఓడించాలని కేసీఆర్ భారీ స్కెచ్చులు గీస్తున్నట్టు తెలుస్తోంది. కొడంగల్ లో కేసీఆర్ తనదైన శైలిలో వల వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఎస్సీలు ఎక్కువగా ఉన్న హుజూరాబాద్ లో దళితబంధును అమలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు గిరిజన జనాభా ఉన్న కొడంగల్ లో ‘గిరిజన బంధు’ అస్త్రాన్ని ప్రయోగించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ 10శాతానికి పైగా ఉన్న ఆ ఓట్లు ఆ సామాజికవర్గానికి చెందినవే కావడంతో గిరిజన బంధు పైలెట్ ప్రాజెక్టుగా ‘కొడంగల్’లో అమలు చేయాలని కేసీఆర్ స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి ప్రస్తుతం దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఆయనకు అదే దారిలో కౌంటర్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొడంగల్ లో నిర్వహించిన సర్వేల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కనిపించిందని.. అందుకే అక్కడి ప్రజలను ఆకట్టుకునేలా గిరిజన బంధు పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.