Begin typing your search above and press return to search.

ట్రిప్ నుంచి రాగానే కేసీఆర్ భారీ స‌మీక్ష‌!

By:  Tupaki Desk   |   11 May 2019 2:00 PM GMT
ట్రిప్ నుంచి రాగానే కేసీఆర్ భారీ స‌మీక్ష‌!
X
ముందుగా అనుకున్న షెడ్యూల్లో మార్పులు చేసుకొని.. మూడు రోజుల ముందు హైద‌రాబాద్‌ కు వ‌చ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. వ‌చ్చీ రాగానే భారీ రివ్యూ స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌టం విశేషం. కొన్ని సంద‌ర్భాల్లో రోజుల త‌ర‌బ‌డి పాల‌న‌కు దూరంగా ఉండే కేసీఆర్‌.. నాన్ స్టాప్ ట్రిప్పుల‌తో కుటుంబ స‌భ్యుల‌తో బిజీబిజీగా గ‌డిపిన ఆయ‌న‌.. ఈ రోజు ఉద‌య‌మే మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ భూనిర్వాసితుల స‌హాయ‌.. పున‌రావాసంపై స‌మీక్ష‌ను నిర్వ‌హించ‌టం గ‌మ‌నార్హం.

త‌న కోర్ టీం అధికారుల‌తో పాటు..  ప్రాజెక్టు ఉన్న సిద్దిపేట‌.. సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌ర్లు. ఆర్డీవోలు.. నిర్వాసితుల‌కు ప‌రిహారం పంపిణీని ప‌ర్య‌వేక్షించిన అధికారుల‌తో  క‌లిసి ఆయ‌న స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో నిర్వ‌హించిన ఈ రివ్యూకు ఎన్నిక‌ల కోడ్ లాంటివి ఇబ్బంది క‌ల‌గ‌లేదు.

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నిర్వాసితుల‌కు త‌గిన ప‌రిహారం ఇవ్వాల‌ని.. స‌హాయ పున‌రావాస‌చ‌ర్య‌లు చేప‌ట్టాలంటూ కాసింత ఘాటుగానే హైకోర్టు రియాక్ట్ అయ్యింది. ఇదే అంశాన్ని కొన్ని ప్ర‌ధాన మీడియా సంస్థ‌లు త‌మ మీడియాలో ఈ అంశానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌టం.. దానిపై కేసీఆర్ అండ్ కో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం.. త‌న సొంత మీడియాలో స‌ద‌రు మీడియా సంస్థ‌ల్ని టార్గెట్ చేయ‌టం లాంటివి విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నిర్వాసితుల‌కు ఇవ్వాల్సిన ప‌రిహార కార్య‌క్ర‌మాన్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

హైకోర్టు ఈ నెల 15న ప‌రిహారం అంశంపై విచారిస్తామ‌ని చెప్పిన క్ర‌మంలో.. ఈ విష‌యం మీద త‌న‌కు మే 11న నాటికి స్టేట‌స్ రిపోర్ట్ ఇవ్వాల‌ని కోరారు. అందుకుత‌గ్గ‌ట్లే ఊరి నుంచి వ‌చ్చిన వెంట‌నే ఇదే అంశం మీద ప్ర‌త్యేక స‌మీక్ష పెట్టిన కేసీఆర్‌.. స‌హాయ పున‌రావాస కార్య‌క్ర‌మాలు ఏ మేర‌కు వ‌చ్చాయ‌న్న అంశాన్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.

చెక్కుల పంపిణీ ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింద‌న్న విష‌యాన్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల‌కు ఇవ్వాల్సిన ప‌రిహారాన్ని ఇచ్చేయాల‌ని సీఎం క్లియ‌ర్ గా చెప్పేయ‌టంతో.. ఆయా ప్రాంతాల్లో టెంట్లు వేసి మ‌రీ చెక్కుల్ని ఇచ్చేసిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చాలా లోతుగా తాజా రివ్యూ మీటింగ్ సాగుతున్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.