Begin typing your search above and press return to search.

సారు ‘66’ బర్త్ డే ను ఎందుకంత ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   17 Feb 2020 1:53 PM GMT
సారు ‘66’ బర్త్ డే ను ఎందుకంత ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు?
X
ప్రతి ఏడాది పుట్టిన రోజు వస్తూనే ఉంటుంది. ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును ఈసారి ఇంత గ్రాండ్ గా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారెందుకు? పుట్టినరోజుకు దగ్గర దగ్గర వారం ముందు.. సారు పుట్టిన రోజున భారీ ఎత్తున మొక్కలు నాటాలంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయటంత సందడి మొదలైంది. అలా మొదలైన జోరు ఈ రోజు ఎంత హడావుడిగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రతివాడలోనూ కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ మనమడు.. కేటీఆర్ కుమారుడు హిమాన్షు స్వయంగా పెద్దమ్మ గుడికి వచ్చి మరీ తాత పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు తోడుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు వెంట ఉండటం గమనార్హం.

సారు కోరిక మేరకు.. ఫిబ్రవరి మధ్యలో భారీగా మొక్కలు నాటే సిత్రమైన కార్యక్రమం జోరుగా సాగుతోంది. సాధారణంగా ఈ కాలంలో మొక్కలు నాటేందుకు ఏ మాత్రం అనువు కాదని చెబుతారు. ఎందుకంటే.. వేసవి మొదలయ్యే వేళలో నాటే మొక్కలకు సరైన పోషణ లేకపోతే బతకటం చాలా కష్టం. అందుకే.. జూన్ లో మొక్కలు నాటే పని చేస్తారు. రాజు కోరుకున్నతర్వాత ఆయన ఇష్టానికి తగ్గట్లుగా కార్యక్రమాలు జరగటం మామూలే. అందుకే.. ఎవరూ ఈ ప్రశ్న వేయకుండా కేటీఆర్ మాటను తూచా తప్పకుండా పాటించేస్తున్నారు.

ప్రధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఏపీ విపక్ష నేత చంద్రబాబుతో సహా.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు.. సెలబ్రిటీలు.. సామాన్యులు.. ఇలా ఎవరికి వారు సారు పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అంత బాగానే ఉంది? మిగిలిన పుట్టినరోజులకు ఈసారి బర్త్ డేకు ప్రత్యేకత ఏమిటి? ఎందుకింత భారీగా కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం లభిస్తోంది.

సారుకు ఇష్టమైన సంఖ్య ‘‘6’’. ఈ రోజు ఆయన ‘‘66’’ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సారుకు ఇష్టమైన సంఖ్య రెండుగా వచ్చిన మేజికల్ ఇయర్ కావటంతో ఇంత గ్రాండ్ గా చేస్తున్నారన్న మాట ఒక పక్క వినిపిస్తుంటే.. అన్ని అనుకున్నట్లు జరిగితే.. యువరాజుకు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం.. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు ఈ ఏడాదే టార్గెట్ పెట్టుకున్నారని.. ఈ కారణం తోనే తెలంగాణ రాష్ట్రం లో సారుకున్న ఇమేజ్ ఏ పాటిదో అందరికి అర్థమయ్యేలా చేయటం కోసమే.. ఇంత భారీగా వేడుక చేస్తున్నట్లు చెబుతున్నారు. చేతిలో అధికారం ఉన్నోళ్లు ఏం చెబితే అది జరగకుండా ఉంటుందా?